kidney stones ఆయుర్వేద చికిత్స….శస్త్రచికిత్స ద్వారా తొలగించిన తర్వాత కూడా కిడ్నీల్లో రాళ్లు మళ్లీ వచ్చే అవకాశం 50% శాతం ఉంది. కానీ, ఆయుర్వేద వైద్యం ద్వారా కిడ్నీలోని లవణాల సమతుల్యతను కాపాడి, కిడ్నీల పని తీరు మెరుగుపరచడంతో మళ్లీ రాళ్లు ఏర్పడకుండా పూర్తిగా నయం చెయ్యవచ్చు.

kidney stones ఆయుర్వేద చికిత్స
కిడ్నీలో రాళ్లు అనగానే చాలామంది పాలకూర, టమోట తినడం వల్ల ఏర్పడతాయి అనడం అపోహ. అవి కేవలం ప్రేరేపితాలు మాత్రమే. కారణాలు కావు. అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి, ఎవరిలో ఏర్పడతాయి వగైరా వాటి గురించి మనం తెలుసుకుందాం.
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్లు అతి సాధారణమైన సమస్యగా మారుతుంది. ప్రపంచ జనాభాలో 10 నుంచి 15 శాతం ఈ సమస్యతో బాధపడితే మన దేశంలో 5 నుంచి 7 మిలియన్ల ప్రజలు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు.
ఈ సమస్య ముఖ్యంగా 20 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో స్త్రీల కంటే పురుషులలో 2 నుంచి 3 రెట్లు అధికంగా గమనించవచ్చు. చిన్న పిల్లలలో చాలా అరుదుగా కనిపిస్తుంది.
మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇవి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి లవణాల సమతుల్యతను కాపాడుతుంది.
ఎప్పుడైతే మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్ఫటిక రూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరుతాయో అప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్ర వ్యవస్థలో భాగమైన మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశంలో ఎక్కడైనా రాళ్లు ఏర్పడతాయి. కాని వాడుక భాషలో వీటన్నింటిని ‘కిడ్నీలో రాళ్లు’ అంటుంటారు.
kidney stones కారణాలు:
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరికొన్ని ఇతర కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక మోతాదులో కిడ్నీలు ఆక్జలేట్స్, కాల్షియం, యూరిక్ యాసిడ్, సిస్టీన్ వంటి కరగని పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించటం వల్ల రాళ్లు ఏర్పడతాయి.
కొందరిలో మూత్రకోశం ఇన్ఫెక్షన్లు, మూత్ర మార్గంలో అడ్డంకులు ఏర్పడటం, హైపర్ పారాథైరాయిడిజం, ఒకేచోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, శరీరంలోని విటమిన్-ఎ శాతం తగ్గడం తదితర కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవికాకుండా మూత్రంలోని రాళ్లని ప్రేరేపించే కారణాలను ప్రిడిస్పోసింగ్ ఫ్యాక్టర్స్ అంటారు.
ఇవి ముఖ్యంగా ఆహారంలో మాంసకృతులు అధికంగా వుండడం, కొన్ని ఇతరత్రా జబ్చుల వల్ల ముఖ్యంగా హైపర్‌కాల్సేమియా, చిన్నప్రేగు ఆపరేషన్లు, రీనల్‌ట్యూబులార్ అసిడోసిస్, జన్యుపరమైన కారణాల వల్ల, కొన్ని రకాలైన మందులు ఆంటాసిడ్స్, విటమిన్-సి, కాల్షియం సప్లిమెంట్ల వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
kidney stones లక్షణాలు:
విపరీతమైన కడుపునొప్పి, నడుమునొప్పి, వాంతులు, మూత్రంలో మంట వంటివి ప్రధాన లక్షణాలు.
కొంత మందిలో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడడం వల్ల ఏదో ఒకవైపు నడుంనొప్పి రావడం, నొప్పితోపాటు జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
దీనినే రీనల్ కోలిక్ అంటారు. కొంతమందిలో మూత్రనాళాల్లో రాళ్లు ఏర్పడతాయి.
దీనివల్ల కలిగే నొప్పిని యురిటరిక్ కోలిక్ అంటారు. నడుము, ఉదరం మధ్యభాగంలో విపరీతమైన నొప్పిరావడాన్ని ఫ్లాన్క్‌పెయిన్ అంటారు.
అక్కడ నుంచి నొప్పి పొత్తి కడుపుకు, గజ్జలకు లేదా కాళ్లలోకి పాకుతుంది.
నొప్పితోపాటు వాంతులు, జ్వరం, మూత్రంలో మంట, మూత్రంలో రక్తం, చీము కూడా కనిపిస్తుంది.
మరికొందరిలో కండరాల బిగుతు, నడుము, ఉదరం మధ్యభాగంలో వాపు, కడుపుబ్బరం వంటి లక్షణాలు కనబడతాయి.
కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలూ కనపడకపోవచ్చు. అలా లక్షణాలేవీ కనపడకుండా కిడ్నీలో ఏర్పడే రాళ్లను సైలెంట్ స్టోన్స్ అంటారు.
kidney stones నిర్ధారణ పరీక్షలు
1. మూత్రపరీక్ష (మూత్రంలోని హానికరమైన బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు, రక్త కణాలు, స్పటికలు, క్యాస్ట్స్‌లను పరీక్షించడం).
2. రక్త పరీక్ష (రక్తంలోని తెల్లరక్త కణాల శాతం, సీరం, కాల్షియం, రీనల్ ఫంక్షన్‌లకు పరీక్షించడం)
3. ఎక్స్‌రే కేవీబీ, అల్ర్టాసౌండ్, సి.టి.స్కాన్, సిస్టోస్కోపి పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారింవచ్చు.
kidney stones ఆయుర్వేద చికిత్స:
ఆయుర్వేద వైద్య పద్ధతి ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించ వచ్చు. వ్యాధి లక్షణాలతోపాటు మానసిక, శారీరక లక్షణాలు కూడా పరిగణలోకి తీసుకొని ట్రీట్‌మెంట్ ఇస్తారు.
శస్త్రచికిత్స ద్వారా తొలగించిన తర్వాత కూడా కిడ్నీల్లో రాళ్లు మళ్లీ వచ్చే అవకాశం 50% శాతం ఉంది.
కానీ, ఆయుర్వేద వైద్యం ద్వారా కిడ్నీలోని లవణాల సమతుల్యతను కాపాడి, కిడ్నీల పని తీరు మెరుగుపరచడంతో మళ్లీ రాళ్లు ఏర్పడకుండా పూర్తిగా నయం చెయ్యవచ్చు.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..
వివరాలకు…
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Website
https://mathrusreeayurveda.com/home/
Facebook :
https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL
https://www.facebook.com/mathrusreeayurveda/
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
Email :
awesome
Your article helped me a lot, is there any more related content? Thanks!
Your article helped me a lot, is there any more related content? Thanks!
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
Your article helped me a lot, is there any more related content? Thanks!
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.