పూర్తి ఆరోగ్యంగా 100% Health….
ఏ వ్యాధులూ సోకకుండా…..
దురదృష్ట వశాత్తు ఏదైనా వ్యాధి సోకితే…
త్వరగా తగ్గిపోవడం ఆయుర్వేదంతో సాధ్యం.
అందుకు పాటించ వలసిన పద్దతులు….
పూర్తి ఆరోగ్యంగా How to Get 100% ….
శుభ్రత….
1) చన్నీటి తలస్నానం సాధ్యమయినంత వరకు తగ్గించాలి. పారుచున్న నీటిలో చన్నీటి తలస్నానం దోషం లేదు.
2) కనీసం నెలకు ఒక సారి అయినా అభ్యంగన స్నానం చెయ్యాలి. ( నువ్వుల నూనెతో ఒంటికి మర్ధన చేయడం, చెవులలో ఆముదం వేసుకోవడం, కండ్లు మరియు ముక్కులో ఆవు నెయ్యి వేసుకోవడం )
3) పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. జీర్ణ వస్ర్తాలను ( ఎక్కువ కాలంగా వాడుతున్న, చీకి పోయిన ) వేసుకోవడం మానుకోవాలి. బాగా బిర్రుగా వుండే వస్త్ర ధారణ మానుకోవాలి.
4) డియోడరెంట్స్ మానుకోవడం మంచిది. వాటి స్ధానంలో న్యాచురల్ సెంటును వాడవచ్చు.
5) పళ్ళు తోముకోవడానికి కెమికల్స్ లేని ఆయుర్వేదీయమైన టూత్ పేష్టులనే వాడండి.
6) స్నానం సబ్బులను కూడా కెమికల్స్ లేని ఆయుర్వేదీయ సబ్బులనే ఉపయోగించండి.
7) తలకు కొబ్బరి నూనె కంటే బాదం నూనె వాడడం చాలా మంచిది. లేదా ఆయుర్వేద పద్దతిలో చేయబడిన హెయిరాయిల్స్ వాడవచ్చు. ( కొబ్బరి నూనె లేనివి ).
శ్రమ….
1) తెల్లవారు జామున 5 గం. కల్లా నిద్ర లేవాలి.
రాత్రి 10 గం. కల్లా నిద్ర పోవాలి.
2) ప్రాణాయామాది యోగా చేయాలి.
3) కనీసం రోజుకు 6 గం. ఏదైనా పని లేదా శ్రమ చేయాలి.
ఆహారం…..
1) అతిగా తినడం త్రాగడం చేయకూడదు.
2) జీర్ణ క్రియ సమర్ధవంతంగా ఉంచుకోవాలి. సంవత్సరానికి 6 ఋతువులు. ప్రతి ఋతువు మారిన వారం రోజులలోపు విరేచనాలకు ఒౌషధం తీసుకోవాలి.
3) చక్కగా తేలికగా జీర్ణమైయ్యే పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి.
4) వంటలలో పప్పు నూనె + ఆవు నెయ్యి వాడడం పూర్తిగా శ్రేష్టం.
5) అల్లం, ఉల్లి, వెల్లుల్లి, దాసిన చెక్క, లవంగాలు మొదలగునవి తగినంత పరిమాణంలో సాధ్యమైనంత వరకు ప్రతి కూరలలో ఉపయోగించాలి.
6) లేత వంకాయ, లేత గోంగూర వేడి చెయ్యవు. కనుక వారంలో ఒకసారైనా తీసుకోవాలి.
7) దుంప కూరలను వారానికి ఒక సారికి మించి తీసుకోకూడదు. ఆకు కూరలు ఆరోగ్యానికి మంచిదనే వుద్దేశంతో అతిగా తినవద్దు. జీర్ణ క్రియ మందగిస్తుంది. వేపుడు కూరలను అవకాశం ఉన్నంత వరకు తగ్గించండి.
8) ప్రతి రోజూ మిరియాల చారును వాడడం చాలా మంచిది.
9) ఏ కాలంలో లభించే పండ్లను ఆయా కాలాల్లో తీసుకోవాలి.
10) మాడిన, పాచిన ఆహారం మరియు పాశ్చాత్య ఆహారాలను పూర్తిగా త్యజించాలి.
11) మాంసాహారం సాధ్యమైనంత వరకు మానుకోవడం మంచిది.
12) ఆవు పాలు, ఆవు పాల పదార్ధాలను వాడడం అత్యంత శ్రేష్టం.
13) కాచి వడపోసి చల్లార్చిన నీరు త్రాగడం శ్రేష్టం. అవకాశం ఉన్నంత వరకు నిల్వ వుంచడం కోసం మరియు క్లీన్ చేయడం కోసం కెమికల్స్ కలిపిన నీటిని త్రాగడం మానుకోవాలి. నీటిని అతిగా పనిగట్టుకుని త్రాగడం మంచిది కాదు. కిడ్నీలపై అధిక భారం పడుతుందని గ్రహించండి. తత్సంబంధిత వ్యాధి పీడితులైనప్పుడు, ఎండా కాలం అధిక ఉదక పాన దోషమాపాదించదు.
14) ఆహారం తీసుకునే సమయంలో కొద్ది కొద్దిగా అవసరానికి తగినంత నీటిని తీసుకోవడం మంచిది.
అతి సర్వత్రా వర్జయేత్ .
15) విటమిన్స్ , మినరల్స్ , ప్రొటీన్స్ ఎంత అవసరమో…. మోతాదు ఎక్కువైతే అంతగా హాని చేస్తాయని గుర్తించి అవసరానికి మించి వాటిని వాడడం మానుకోవాలి.
విహారాదులు…,
1) అవసరం లేని ప్రయాణాలు చేయకూడదు.
2) నడక ఆరోగ్యానికి మంచిదే. కానీ అతిగా ఆ పని చేయకూడదు.
3) పాశ్చాత్య సంగీతం పలు మానసిక వికారాలకు కారణమౌతోంది కనుక దానిని త్యజించాలి.
ఇతరములు…..
1) అవకాశం ఉన్నంత వరకు పెయిన్ కిల్లర్స్ , స్టెరాయిడ్స్ , యాంటిబయోటిక్స్ వాడడం మానుకోవాలి.
2) ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అతిగా వ్యవహరించ వద్దు.
3) శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యం హానికరం.
కనుక టి.వి, రేడియోలలో ఎక్కువ ధ్వనిని ఉపయోగించ
వద్దు.
4) అతిగా మాట్లాడకూడదు.
5) అతిగా ముఖ్యంగా పగటి పూట నిద్రించ వద్దు. జబ్బు పడినప్పుడు, పసి పిల్లలకు, వృద్దుల విషయంలో దోషం లేదు.
6) కెమికల్స్ తో చేసిన ఫేస్ క్రీమ్స్ , లోషన్స్ పూర్తిగా మానుకోండి.
ఒౌషధాలు….
ముందుగా…. క్రితం వున్న వ్యాధులను ఆయుర్వేద చికిత్స ద్వారా నివారణ చేసుకోవాలి.
తరువాత……
1) 25 సం|| పైబడిన స్త్రీ పురుషులు ” సిద్ధ మకరధ్వజం” కనీసం సంవత్సరానికి 2 నెలలు వాడాలి.
2) 25 సం|| లోపు వారు ” షడ్గుణ సింధూరం ” వాడాలి.
3) ఆస్తమా లాంటి వ్యాధులు ఉన్నట్లయితే ” మహా కనక సింధూరం ” లేదా ” మహా లక్ష్మీ విలాస రసం ” వాడాలి.
4) మధుమేహం, బి.పి , థైరాయిడ్ వ్యాధులున్నట్లెైతే ” వసంత కుసుమాకరం ” వాడాలి.
5) ఏ వయసు వారయినా ప్రతి రోజూ కనీసం ఒకసారైనా ” అశ్వగంధారిష్ట ” లేదా ” ద్రాక్షారిష్ట ” టానిక్ తీసుకోవాలి.
6) విద్యార్ధులకు ” సరస్వతి లేహ్యం ” వాడాలి.
7) వయో వృద్దులు ” అశ్వగంధాది లేహ్యం ” వాడాలి.
ఈ విధంగా చేస్తే ఏ వ్యాధులు సోకవు. అంతఃక్రితం ఉన్న వ్యాధులన్నీ చాలా త్వరగా తగ్గిపోతాయి. అంటు వ్యాధులు మన దరిచేరవు.
నరాలు, ఎముకలు, కండరాలు చాలా ధృఢంగా వుంటాయి.
సమస్త చక్షురింద్రియములు, కర్మేంద్రియములు పూర్తి ఆరోగ్యంగా వుంటాయి. మానసిక ఆరోగ్యం చాలా చక్కగా వుంటుంది.
సాధ్యమైనంత వరకు ఆయుర్వేద వైద్య చికిత్స మాత్రమే తీసుకోండి. కెమికల్స్ కలిసిన మందులకు దూరంగా వుండండి. పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా వుండడం సాధ్యమవుతుంది.
ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..
వివరాలకు….ఆయుర్వేద శాస్త్రమ్ పేజిలోని Send Message option ద్వారా మీ యొక్క సందేహాలను ఇతర వివరాలను అడిగి తెలుసుకునే అవకాశం వుంది.
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Website
https://mathrusreeayurveda.com/home/
Facebook :
https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL
https://www.facebook.com/mathrusreeayurveda/
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
Email :