రుతుశూల ( Abdomen Pain ) ( PCOD) కారణాలు, లక్షణాలు, తేడాలు. ఆయుర్వేదంలో రుతుశూల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సంవత్సరాల తరబడి మందులు వాడాల్సిన అవసరం లేదు.
Abdomen Pain – రుతు శూల
స్త్రీలకు రుతు కాలంలో (Menstrual Pain At Periods Time ) వచ్చే కడుపు నొప్పిని ఆయుర్వేద పరి భాషలో “రుతు శూల” అంటారు.
సుమారు 50 శాతం మంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. యుక్తవయస్సు అంటే 18 నుంచి 24 సంవత్సరాల వరకు ఈ నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. క్రమేణ వయస్సు పెరుగుతున్న కొద్దీ కొంత మంది స్త్రీలలో వివాహానంతరం నొప్పి తీవ్రత తగ్గుతుంది.
పొత్తికడుపులో నొప్పి! ప్రతి స్త్రీ.. జీవితంలో ఎప్పుడోసారి ఎదుర్కొనే సమస్యే ఇది. కానీ 12-20% మందిలో ఇది వీడకుండా దీర్ఘకాలం వేధిస్తోంది. గైనకాలజిస్టులను సంప్రదించే స్త్రీలలో 10% మంది ఇటువంటి దీర్ఘకాలిక నొప్పితోనే వస్తున్నారంటే ఈ ‘నొప్పి’ తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కొంతమందికైతే రిపోర్టులన్నీ నార్మల్, ‘నొప్పి’ మాత్రం బాధిస్తూనే ఉంటుంది.
రుతుచక్రం సాధారణంగా 28 రోజులకు ఒకసారి పునరావృతమవుతుంటుంది. 3 రోజుల నుంచి 7 రోజుల పాటు కనిపిస్తుంది. రుతుక్రమాన్ని, రుతుస్రావాలను మెదడులోని హైపోథాలమస్, పిట్యూటరీగ్రంథి, ఆండాశయంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు, గర్భసంచిలో ఉత్పత్తి అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ అన్నీ కలిపి ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, హార్మోన్ల వ్యవస్థపై బలమైన ప్రభావం చూపుతుంది. రుతుక్రమం సమయంలో నొప్పి రావడానికి గల ప్రధాన కారణం ప్రొస్టాగ్లాండిన్స్ అనే ఒక రసాయనం. ఈ రసాయనం గర్భకోశం లోపలి పొరల్లో ఉత్పత్తి అవుతుంది.
పొత్తికడుపులోనెలసరితో పాటుగా పొత్తికడుపులో నొప్పి అన్నది చాలామందిలో కనబడే సమస్య. రజస్వల అయిన రెండుమూడేళ్ల తర్వాత ఆడపిల్లల్లో చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ నొప్పిని ‘స్పాస్మోడిక్ డిస్‌మెనోరియా’ అంటారు. రుతుక్రమంలో భాగంగా గర్భసంచిలో ఏర్పడిన పొరను బయటకు పంపించేందుకు.. నెలసరి సమయంలో గర్భసంచి బలంగా సంకోచిస్తుంటుంది. ఫలితంగా ఆ సమయంలో తెరలు తెరలుగా నొప్పి వచ్చి పోతుండొచ్చు. వీళ్లు నెలసరి ఆరంభమైన రోజు నుంచే ‘ఆయుర్వేద చికిత్స’ మొదలుపెట్టి, దాన్ని ఒక కోర్సులా తీసుకోవాలి. మిగతా నొప్పులతో పోలిస్తే ఈ నెలసరి నొప్పి చాలా భిన్నంగా ఉంటుంది. ఇది బాగా తీవ్ర దశకు చేరుకుంటూ.. పోతూ.. వస్తుంటుంది. ఇది లోపల జరుగుతున్న ప్రక్రియ కారణంగా వస్తున్న నొప్పి కాబట్టి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకూ పోయేది కాదు. కాబట్టి అదే పోతుందిలే అని బాధపడే కంటే ముందే ఆయుర్వేద చికిత్స తీసుకోవటం ఉత్తమం. మందులకు అలవాటు పడిపోతామేమోనని భయపడాల్సిన పని లేదు. ఆయుర్వేదంలో రుతుశూల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సంవత్సరాల తరబడి మందులు వాడాల్సిన అవసరం లేదు. ఆ తీవ్రమైన నొప్పికి వాంతుల వంటివీ రావచ్చు. కాబట్టి దీన్ని ముందే ఊహించి.. ముందు నుంచే చికిత్స తీసుకోవటం ఉత్తమం. నెలసరి అన్నది ప్రకృతి సహజమని, దానితో నెగ్గుకురావటం ఎలాగో తెలుసుకోవటం ముఖ్యమని అర్థం చేసుకోవటం అవసరం.
సాధారణ కారణాలు
- పొత్తికడుపులో నొప్పి అన్నది సుఖవ్యాధుల వల్ల కూడా రావచ్చు. కాబట్టి లైంగికంగా చురుకుగా ఉన్న ఆడపిల్లలు, స్త్రీలకు నొప్పి వస్తుంటే ఆ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించటం కూడా అవసరం.
- కొందరిలో నొప్పి నెలసరికి ముందు వస్తుంటుంది, చాలాసార్లు నెలసరి రాగానే తగ్గిపోతుంది. వీరిలో చాలా వరకూ పొత్తికడుపులో ఇన్ఫెక్షన్‌గానీ.. ఇతరత్రా మరేదైనా కారణం ఉందేమో పరిశీలించాల్సి ఉంటుంది.
- గర్భాశయంలో నెలనెలా పెరుగుతుండాల్సిన ఎండోమెట్రియం పొర గర్భాశయం లోపలే కాకుండా.. ఇతరత్రా ప్రాంతాల్లో కూడా పెరుగుతుండటం పెద్ద సమస్య. దీన్నే ‘ఎండోమెట్రియోసిస్’ అంటారు. దీనివల్ల కూడా నెలసరి సమయంలో నొప్పి రావచ్చు. లేదా గర్భాశయంలో కణితులు (ఫైబ్రాయిడ్స్) పెరుగుతున్నా కూడా నొప్పి వస్తుంది.
- ఒకవేళ సంతానం కలగకుండా.. పొత్తికడుపులో నొప్పి వేధిస్తుంటే.. చాలా వరకూ ‘ఎండోమెట్రియోసిస్’ను అనుమానించాల్సి ఉంటుంది. లేదా ఫలోపియన్ ట్యూబులు మూసుకుపోవటానికి కారణమైన ‘క్రానిక్ పెల్విక్ ఇన్ఫెక్షన్’ వంటివి కూడా కారణం కావచ్చు. వీటిని పరీక్షల్లో నిర్ధారించుకోవచ్చు.
అన్నీ నార్మల్.. కానీ నొప్పి!
ఎంతోమంది స్త్రీలు దీర్ఘకాలంగా పొత్తికడుపులో నొప్పితో బాధపడుతుంటారు. ఎన్నో పరీక్షలూ పూర్తవుతాయి.. కానీ నిర్దిష్టమైన కారణమేదీ కనబడదు. వైద్యులు స్పష్టమైన కారణమేదీ లేదని చెబుతున్నా.. వాళ్లకు నొప్పి మాత్రం వేధిస్తూనే ఉంటుంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక తీవ్ర వేదన, క్రమేపీ కుటుంబ జీవితం.. దాంపత్య జీవితం అన్నీ ప్రభావితమవటం వంటివీ మొదలవుతాయి. చివరికి ఏం చెయ్యాలో పాలుపోని అయోమయ స్థితిలో పడిపోవచ్చు. ఇటువంటి వారి విషయంలో… పరీక్షల్లో అంతా ‘నార్మల్’గానే ఉంది కాబట్టి ‘నొప్పి’ లేదని కాదు. ఆ నొప్పి ‘కేవలం మానసికం’ అని వదిలెయ్యటానికి లేదు. వారికి ‘నొప్పి’ ఉన్న మాట వాస్తవం అని గుర్తించటం, దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషించటం అవసరం. అయితే అన్నిసార్లూ నొప్పికి కచ్చితమైన కారణాలు గుర్తించటం సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు నెలనెలా గర్భాశయంలో పెరుగుతుండే ఎండోమెట్రియం పొరలు.. అక్కడి నుంచి బయటపడి చిన్నచిన్నగా పొత్తికడుపులో అక్కడక్కడ అతుక్కుని ఉన్నా కూడా నొప్పి వస్తుంది. కానీ వాటిని సాధారణ పరీక్షల్లో గుర్తించటం అంత తేలిక కాదు. దీర్ఘకాలంగా పొత్తికడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాన్ని గుర్తించలేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుర్వేద చికిత్స కన్నా అత్యుత్తమం మరేదీ లేదు.
బహిష్టు క్రమానికి సంబంధించి :
బహిష్టు సమయంలో 2 నుంచి 3 రోజుల ముందునుంచి వచ్చే నొప్పి, బహిష్టు స్రావం ఆగిపోయే వరకూ ఉండే నొప్పి (డిస్మెనోరియా), ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్, బహిష్టు మొదలైన 12 నుంచి 14 రోజుల మధ్య అండాశయం నుంచి అండం విడుదలయ్యే సమయంలో కొంత మందిలో పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. ఈ నొప్పి ఒకటినుంచి రెండు రోజుల వరకూ ఉంటుంది.
గర్భాశయ కారణాలు :
గర్భాశయంలో కంతులు, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ వంటి గర్భాశయ గోడల కణజాలంలో సాధారణ మార్పులు కలగడం, గర్భాశయ స్థానంలో మార్పు రావడం, గర్భాశయం యోనిభాగంలోకి లేదా యోని వెలుపలకు జారడం.
అండాశయ కారణాలు :
నీటి బుడగలలాంటి సిస్ట్‌లు (చాకొలెట్ సిస్ట్స్) పగలడం, వొవేరియన్ సిస్ట్ ఉండటం. ఈ రెండు కారణాల్లో పొత్తి కడుపులో నొప్పితోపాటు బహిష్టు క్రమంలో తేడాలు కూడా వస్తాయి.
పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ :
గర్భాశయం, గర్భాశయ వాహికలు, అండాశయాలు, దానికి సంబందఙంచిన ఇరుప్రక్కల భాగాలకు ఇన్‌ఫెక్షన్ సోకడం.
గర్భిణీగా ఉన్నప్పుడు :
అబార్షన్ కావడం, గర్భాశయంలో కాకుండా అండవాహికలలో గర్భం ఏర్పడి దానికదే చెదరిపోవడం, గర్భాశయంలో ఏర్పడిన పిండం లోపలే చనిపోయినప్పుడు చాలా తీవ్రంగా పొత్తి కడుపులో నొప్పితోపాటు ఇతర లక్షణాలు, అంటే రక్తస్రావం మొదలైనవి కనిపిస్తాయి.
జీర్ణకోశ వ్యవస్థలకు చెందిన వ్యాధులు:
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, అపెండిసైటిస్, మలబద్ధకం, మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఇన్‌ఫెక్షన్ సోకడం, లేదా రాళ్లు ఏర్పడటం, ఎముకలకు సంబంధించిన, ముఖ్యంగా నడుము భాగంలోని ఎము కల, కండరాలకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు, చిట్లడం తదితర కారణాల వల్ల పొత్తి కడుపులో నొప్పి వస్తుంది.ఇవే కాకుండా, గర్భాశయ వాహికల స్థితిని తెలుసు కోవడానికి, ప్లిలలు పుట్టని స్త్రీలకు చేసే పరీక్ష అయిన హిస్టరో సాల్పింజోగ్రామ్ (హెచ్‌ఎస్‌జి) వాడే రసాయన పదార్థాల వల్ల కూడా ఒక్కొక్కసారి నొప్పి రావచ్చు.
అంతేకాకుండా, పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలలో దేనితోనో ఒకదానితో బాధపడుతూ, మానసిక విచారం, ఆందోళన, దిగులుకు లోనైన వారిలో కూడా పొత్తి కడుపు నొప్పి అంత సులభంగా నయం కాదు. తరచుగా బాధిస్తుంటుంది కూడా.
నొప్పితో కూడిన సమస్యలు:
గర్భాశయానికి సంబంధించిన వ్యాధులతో కలిగే నొప్పి ముందు పొత్తి కడుపులో మొదలై, తరువాత కడుపు మొత్తానికి ప్రాకుతుంది.పొత్తికడుపులో నొప్పి ఉండి బహిష్టులు కాని వారిలో ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటివి కారణమై ఉంటాయి.
ఆకలి కాకపోవడం, వాంతి వచ్చినట్లు ఉండటం, వాంతులు కావడం మొదలైనవి జీర్ణాశయగత వ్యాధులకు సంబంధించిన పొత్తి కడుపు నొప్పితో అనుసంధానమై ఉంటాయి.
తరచుగా మూత్రం పోవడం, మూత్ర విసర్జనలో నొప్పి, అరుదుగా జ్వరంతో కూడి పొత్తి కడుపు నొప్పి మూత్రాశయ వ్యాధుల్లో ఉంటుంది.
జ్వరం, చలి, వణుకు, మూత్రం కష్టంగా ఉండటం తదితర లక్షణాలతో కూడిన పొత్తి కడుపు నొప్పి ఎక్యూట్ పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌లో ఉంటుంది.
కడుపు నొప్పితోపాటు మూర్ఛ వచ్చి పడిపోవడం, కళ్లు తిరిగి పడిపోవడం ఉంటే పొట్టలో రక్తస్రావాన్ని కలిగించే వ్యాధులున్నాయని అనుమానించి తక్షణమే వైద్య సహాయం పొందాలి. గర్భాశయంలో
అసాధారణ ఎదుగుదలలు ఉన్నా, కంతులు ఉన్నా నాడి కొట్టుకోవడం, బిపి, గుండె పని తీరులలోనూ తేడాలు ఉండే అవకాశా లుంటాయి.
నొప్పి వస్తుంటే ఈ సమస్య ఉందేమో చెక్ చేసుకోండి..
- మలబద్ధకం.. కొన్ని రోజులుగా మలబద్ధకం సమస్య ఉన్నా కడుపునొప్పి వస్తుంటుంది. …
- క్యాన్సర్స్.. …
- ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్.. …
- అపెండిసైటిస్.. …
- గ్యాస్.. …
- ఫుడ్ పాయిజనింగ్.. …
- కిడ్నీలో రాళ్ళు..
మలబద్ధకం..
- కొన్ని రోజులుగా మలబద్ధకం సమస్య ఉన్నా కడుపునొప్పి వస్తుంటుంది. దీనిని తగ్గించేందుకు మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యంగా ఫైబర్ ఫుడ్ వీటితో పాటు నీరు ఎక్కువగా తాగడం మంచిది. సరైన జీవనశైలి లేని కారణంగా చాలామందిని మలబద్ధకం వేధిస్తుంటుంది. సరైన వేళలో లేవడం, ఫైబర్, సమతుల ఆహారం తీసుకోవడం, హాయిగా నిద్రపోవడం వంటివి చేయడం వల్ల చాలా వరకూ సమస్య దూరమవుతుంది.
- మలబద్ధకం అనే సమస్య నివారణకు ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి.
గ్యాస్..
1. పొత్తికడుపులో నొప్పి రావడానిక గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా కారణం కావచ్చు. సాధారణ కారణాల్లో ఒకటి యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కూడా నొప్పి వస్తుంది.
2. గ్యాస్ట్రిక్ ట్రబుల్ నివారణకు ఆయుర్వేదం అత్యుత్తమ వైద్య విధానం
ఫుడ్ పాయిజనింగ్..
- సాధారణంగా కడుపులో వైరస్, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు ఉన్నా కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. దీనిని ఎప్పటికప్పుడు గమనించాలి. శుభ్రమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.
- బయట దొరికే జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తినకపోవడమే మంచిది. ఇందులో వాడే ఆయిల్స్ వల్ల ఎక్కువగా సమస్య వస్తుంది. కాబట్టి, వీటిని తీసుకోపోవడమే మంచిది. దీని బదులు మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా ఉత్తమం.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI)
మన మూత్ర వ్యవస్థ సాధారణంగా సూక్ష్మజీవుల ద్వారా బాహ్య ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి రూపొందించబడింది. కానీ కొన్నిసార్లు ఈ రక్షణ సరిపోకపోవచ్చు. కొన్ని బ్యాక్టీరియాలు మీ మూత్ర వ్యవస్థలోకి ప్రవేశించవచ్చు.
ఈ బ్యాక్టీరియాలు పెరగడంతో మీ పొత్తికడుపులో నొప్పికి దారితీసే ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.
ఈ అంటువ్యాధులు కొన్నిసార్లు ద్రవాలు, నీటిని తీసుకోవడం ద్వారా దూరం కావొచ్చు. కొన్నిసార్లు తీవ్రంగా కూడా ఉండవచ్చు. మీ మూత్రపిండాలను కూడా ప్రభావితం చేయవచ్చు.
తీవ్రమైన UTI మీ పొత్తికడుపులో రెండు వైపులా దీర్ఘకాలిక నొప్పికి దారితీస్తుంది
UTI ని ఇలా నియంత్రించవచ్చు మరియు నిరోధించవచ్చు
1.నీరు, ఇతర ద్రవాలను పుష్కలంగా తాగాలి
2.మల మూత్ర విసర్జన తరువాత సరియైన పరిశుభ్రతను పాటించాలి
3.ఏ కొద్దిపాటి ఇబ్బందిని గుర్తించినా సకాలంలో ఆయుర్వేద చికిత్స తీసుకోవాలి
కిడ్నీ ఇన్ఫెక్షన్..
- సాధారణంగా మీ మూత్రనాళం నుండి వచ్చే బ్యాక్టీరియా కారణంగా కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది. మీ కిడ్నీల్లో ఒకటి లేదా రెండు కూడా ఇన్ఫెక్షన్కు గురవ్వడం వల్ల ఎఫెక్ట్ అవుతాయి. పొత్తికడుపులో నొప్పి వస్తుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ నుండి ఇబ్బంది వస్తుంది.
- ఏ కొద్దిపాటి ఇబ్బందిని గుర్తించినా సకాలంలో ఆయుర్వేద చికిత్స తీసుకోవాలి.
రుతు శూలను రెండు రకాలుగా చెప్పవచ్చు.
1. ప్రైమరీ డిస్మనోరియా : యుక్తవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. దీనికి హార్మోన్ అసమతుల్యత ప్రధానమైక కారణంగా ఉంటుంది.
2. సెకండరీ డిస్మనోరియా : వయసు పైబడిన స్త్రీలలో కనిపిస్తుంది. పొత్తికడుపు ఇన్‌ఫెక్షన్లు, గర్భాశయ కణుతులు ప్రధానమైన కారణం.
ముఖ్యకారణాలు:
హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయ కణుతులు, గర్భాశయ ముఖద్వారం ఇరుకుగా ఉండటం, ఓవేరియన్ సిస్టులు.
వ్యాధి లక్షణాలు:
రుతుక్రమ సమయానికి 3 నుంచి 7 రోజుల ముందు నొప్పి మొదలవుతుంది. దీన్ని కంజెస్టివ్ డిస్మనోరియా అంటారు. రుతుస్రావం మొదలయిన తరువాత నొప్పి ప్రారంభమై రక్తస్రావం తీవ్రంగా ఉండి ఒకటి రెండు రోజుల వరకు కొనసాగే నొప్పిని స్పాస్‌మోడిస్ డిస్మనోరియా అంటారు. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో పాటు, వెన్నునొప్పికూడా బాధిస్తుంది. విపరీతమైన చిరాకు, కోపం, ఆకలి మందగించడం, నీరసం వంటి లక్షణాలుంటాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
హార్మోన్ల సమతుల్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తినాలి. స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి. మానసిక ప్రశాంతత అలవర్చుకోవాలి.
ఆయుర్వేద చికిత్స:
రుతుశూలకు ( Abdomen Pain ) ( PCOD ) ఆయుర్వేదంలో శాశ్వత చికత్స ఉంది. వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే రుతుశూల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
సంవత్సరాల తరబడి మందులు వాడాల్సిన అవసరం లేదు.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..
వివరాలకు…
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Website
https://mathrusreeayurveda.com/home/
Facebook :
https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL
https://www.facebook.com/mathrusreeayurveda/
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
Email :