Cow Milk ఆవు పాలు

Social Share
Cow Milk ఆవు పాలు
Cow Milk ఆవు పాలు

 

ఆవు పాలు:

సమశీతోష్ణమయినవి, వేడిని నిలుపును. త్రిదోష హరము. వీర్య పుష్టిని, దేహ పుష్టిని యిచ్చును. శ్వాస కాసలు, శ్రమ, భ్రమ, మూత్రకృచ్ఛము, నీరు, క్షయ, రక్త పైత్యము, వాత పైత్యము, జీర్ణ జ్వరము వీటిని పోగొట్టును. జఠర దీప్తినిచ్చును. ధాతు క్షీణమయిన వారికి అనుకూలముగా వుండును. బుద్ది బలమిచ్చును. స్ర్రీల పిండోత్పత్తి స్ధానమునకు బలముజేయును. స్ర్రీలకు విస్తారముగా పాలుబడజేయును. సర్వవిధ వ్యాధులలో అమోఘముగా ఉపయుక్తమై వుండును.

ఆవు పెరుగు:

ప్రాణ ప్రదమయినది. త్రిదోష హరము. తాపమునణచును, జఠర దీప్తి, దేహ పుష్టి, వర్చస్సులను యిచ్చును.

ఆవు వెన్న:

ఆయుర్వృద్ధిని, వీర్య పుష్టిని, ధాతు పుష్టిని యిచ్చును. చలువ చేయును. త్రిదోషములను శమింపజేయును. నేత్ర రోగములను పోగొట్టును. క్షయ, గ్రహణి, కాక దగ్గులను పోగొట్టును. జఠర దీప్తిని, వర్చస్సును పెంచును. మల మూత్ర బద్దములను పోగొట్టును.

ఆవు మజ్జిగ:

చలువ చేయును. త్రిదోష హరము. జీర్ణ శక్తినిచ్చును. ఆమాతిసారము, నీరు, గ్రహణి, పాండువు, గుల్మము, మూల వ్యాధి, కామెర్లు, పురాణ జ్వరము, అరుచి, శోష, శ్వాస కాసలు, క్షయ ఈ రోగ గ్రస్తులకు మిక్కిలి ఉపయుక్తముగా వుండును.

ఆవు నెయ్యి:

త్రిదోష హరమైనది. ధాతు పుష్టి, వీర్య పుష్టి, రక్త పుష్టి చేయును. మిక్కిలి పైత్య హరమైనది. జఠర దీప్తినిచ్చును. ఉన్మాదము, పాండువు, సర్పి, చిత్త భ్రమ, వీని పీడితులకు మిక్కిలి ఉపయోగము. ఆయుర్వృద్ధినిచ్చును. సర్వ దోషములను పోగొట్టును.

గోమూత్రము:

త్రిదోషములను అణచును. ఆకలి పుట్టించును. చర్మ వ్యాధులు, నీరు, పాండు రోగము, గుల్మము, శ్వాస, కాస, మూత్ర కృచ్ఛము, మూల వ్యాధి, జ్వరములను పోగొట్టును. దేహపు కాకను నిలుపును. మల మూత్ర బద్ధములను పోగొట్టును. ఆయుర్వృద్ధినిచ్చును. ధీర్ఝ రోగములను నివారణ చేయును. సర్ప దంష్ర్ట విషమును సైతం విరచును. రక్త శుద్ది చేయుటలో మిక్కిలి ఉపయోగం. వ్యవసాయంలో క్రిమి సంహారణకు ఉపయోగపడును. పంటలకు చీడ పీడలను దరిజేరనివ్వకుండును.

ఆవు పేడ:

మలినమును, దుర్గంధమును పోగొట్టును. ఉన్మాద రోగమును పోగొట్టును. విషవాయు దోషములను హరించును. జ్వరమును పోగొట్టును. భూమిని సారవంతము చేయును.

తల్లి పాలు అందుబాటులో లేనప్పుడు ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి.

కామెర్లు, దగ్గు, ఆయాసం, క్షయ వ్యాధి గ్రస్తులు నెయ్యి వాడరాదు. కానీ, ఇటువంటి వ్యాధి గ్రస్తులు కూడా ఆవు నెయ్యిని వాడవచ్చు.

అజీర్ణము, కడుపుబ్బరము, త్రేనుపులు, కిడ్నీ స్టోన్స్ , క్యాన్సర్ వ్యాధులలో పాలు వాడరాదు. కానీ, ఇటువంటి వ్యాధి గ్రస్తులు కూడా ఆవు పాలు వాడవచ్చు.
అన్ని రకాల వ్యాధుల నివారణలో ఆవు పాలు మరియు ఆవు పాల పదార్ధములు ఒౌషధాలకు అనుపానమై సహాయకారిగా వుండును.

ఏవిధమైన వ్యాధి పీడితులైనా నిస్సందేహముగా ఆవు పాలు మరియు ఆవు పాల పదార్ధములను వాడవచ్చు.

ఆవు మన పరిసరాలలో ఉండుట వలన వాయుశుద్ది జరుగును. ఆవు పీల్చి వదిలే గాలి హానికరములైన క్రిములను రానివ్వకుండును. తద్వారా వాతావరణ స్వచ్ఛతను కాపాడును.

ఆవు పాలు వేడి చెయ్యవు వేడిని నిలుపును. మనం నివసించే వాతావరణానికి తగిన విధంగా శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడాన్ని “వేడిని నిలుపుట” అంటారు.

పైన తెలుపబడిన ఆయుర్వేద పరిభాష పద అర్ధాలు:
1) ఆమాతిసారము = బంక విరేచనాలు
2) గ్రహణి = రక్త విరేచనాలు
3) పాండువు = రక్త క్షీణత వలన వచ్చు వ్యాధి
4) గుల్మము = అల్సర్
5) మూల వ్యాధి = మొలలు, పైల్స్
6) పురాణ జ్వరము = ధీర్ఝ కాలముగా వున్న జ్వరము
7) అరుచి = రుచిని సరిగా గుర్తించలేకపోవుట
8) శోష = శొమ్మసిల్లుట
9) కాస = దగ్గు
10) శ్వాస = ఆయాసం
11) జఠర దీప్తి = జీర్ణ శక్తి
12) మూత్ర కృచ్ఛము = బాధతో మూత్రము బొట్లు బొట్లుగా వచ్చుట
13) ఉబ్బు = నీరు అనెడి వ్యాధి
14) రక్త పైత్యము = ముక్కు లేదా నోటి వెంట రక్తము కారుట
15) వాత పైత్యము = రక్త ప్రసరణ లోపం
16) జీర్ణ జ్వరము = ఎంతకూ తగ్గని లేదా తరచూ వచ్చు జ్వరము
17) తాపము = నీరసము
18) కాంతి = ముఖ మరియు శరీర వర్ఛస్సు
19) భ్రమ = మానసిక వికారము

 

వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..

Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700

Website
https://mathrusreeayurveda.com/home/

Facebook :

https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL

https://www.facebook.com/mathrusreeayurveda/

https://m.facebook.com/doctorayurvedaandsiddha

https://m.facebook.com/ayurvedaandsiddha

Youtube:

https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg

Email :

drmahesh@mathrusreeayurveda.com

Leave a comment

Open chat
1
మీ పేరు,వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
సాధ్యమయినంత త్వరలో స్పదించగలము.

దయచేసి,పూర్తి వివరాల కొరకు Dr.Mahesh గారిని సంప్రదించగలరు.
cell no: 9701965700 ; 8686622900

సంప్రదించవలసిన వేళలు: 11 Am to 8 PM
సంప్రదించినందులకు ధన్యవాదాలు.