Jaundice కామెర్ల వ్యాధి

Social Share

Jaundice కామెర్ల వ్యాధి …. చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుపచ్చ రంగుకు మారడమే కామెర్ల (జాండీస్‌)కు కొండగుర్తు. రక్తంలో బైలిరుబిన్‌ అనే పదార్థం అధికంగా చేరడం అన్నది ఈ కండిషన్‌కు దారిలీస్తుంది. బైలిరుబిన్‌ అనేది పసుపురంగులో ఉండే ఒక వ్యర్థ పదార్థం. ఎర్రరక్తకణాలలోని హిమోగ్లోబిన్‌ తొలగిపోయాక మిగిలిపోయే భాగం ఇది.

Jaundice కామెర్ల వ్యాధి
kaamila

 

Jaundice కామెర్ల వ్యాధి 

బైలిరుబిన్‌ పరిమాణం ఎక్కువైనప్పుడు అది చుట్టుపక్కల కణజాలాలోకి చేరి వాటికి పసుపురంగును కలిగిస్తుంది.సాధారణంగా రక్తంలోని బైలిరుబిన్‌ను కాలేయం తొలగిస్తుంటుంది.

బైలిరుబిన్‌ పరిమాణం ఎక్కువైనప్పుడు అది చుట్టుపక్కల కణజాలాలోకి చేరి వాటికి పసుపురంగును కలిగిస్తుంది.సాధారణంగా రక్తంలోని బైలిరుబిన్‌ను కాలేయం తొలగిస్తుంటుంది.

కాలేయం దీన్ని పైత్యరసంలోకి పంపిస్తుంది. ఈ జీర్ణరసం ద్వారా ఆహారంలోకి చేరిన బైలిరుబిన్‌ జీర్ణప్రక్రియ చివరివరకూ కొనసాగి చివరకు మలంతో విసర్జితమవుతుంది.

మలానికి రంగు దీనివల్లనే ఏర్పడుతుంది.అనేక కారణాలు, అలవాట్లు, వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడి Jaundice కామెర్ల వ్యాధి వస్తుంది.

గుర్తించడం ఎలా?

సాధారణంగా బయటకు కనిపించేది, అత్యధికులకు తెలిసింది చర్మం, కళ్లు పచ్చగా మారడం. ఇది మొదట తల భాగంతో ప్రారంభించి క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ పచ్చదనం కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఈ వ్యాధిలో కనిపిస్తుంటాయి.

  1. దురదలు: చర్మంలో బైల్‌ సాల్ట్‌ అధికంగా చేరడం వల్ల శరీరమంతటా దురదలు వస్తాయి.
  2. అలసట: స్పష్టమైన ఏ కారణం లేకుండానే విపరీతమైన అలసట కనిపిస్తుంది. బరువు తగ్గిపోతుంది.
  3. జ్వరం: హఠాత్తుగా జ్వరం వస్తుంది. వాంతులవుతాయి.
  4. నొప్పి: పొట్టలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
  5. మలమూత్రాల రంగు మారడం: సాధారణంగా కొద్దిపాటి లేత పసుపురంగుతో తేటగా ఉండే మూత్రం చిక్కగా గోధుమరంగులో వస్తుంది.అలాగే మలం తెలుపు, ఆకుపచ్చ రంగులో ఉండటం కూడా కామెర్ల వ్యాధి లక్షణాలలో ముఖ్యమైనది.
కారణాలు ఏమిటి?

ప్రధానంగా రెండు కారణాల వల్ల జాండిస్‌ సోకుతుంది. మొదటిది శరీరంలోని బైలిరుబిన్‌ అత్యధికంగా ఉత్పత్తి అవుతుండటం.

రెండోవది సహజంగా ఉత్పత్తి అవుతున్న బైలురుబిన్‌ను కాలేయం తొలగించలేకపోవడం.

ఈ రెండు సందర్భాల్లోనూ బైలిరుబిన్‌ శరీర కణజాలంలో చేరి స్థిరపడుతుంది. కామెర్లవ్యాధి సోకిన వ్యక్తి శరీర అంతర్భాగంలో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.

కాలేయం వాపు: ఇలా వాపు రావడం వల్ల బైలిరుబిన్‌ను గుర్తించి, దాన్ని తొలగించే సామర్థ్యం మందగించి, రక్తంలో ఆ వ్యర్థపదార్ధం పరిమాణం పెరుగుతూపోతుంది.

బైల్‌డస్ట్‌ వాపు: పైత్యరసం నాళం వాపు కారణంగా ఆ జీర్ణరసం స్రవించడానికీ, తద్వారా బైలిరుబిన్‌ను తొలగించడానికి ఆటంకంగా తయారవుతుంది. దాంతో కామెర్ల వ్యాధి కనపడుతుంది.

పైత్యరస నాశఠంలో అడ్డంకులు: ఇది బైలిరుబిన్‌ను తొలగించే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

హీమోలైటిక్‌ అనీమియా: భారీసంఖ్యలో ఎర్రరక్తకణాలు విచ్చిన్నమైనప్పుడు శరీరంలో పెద్ద మొత్తంలో బైల్‌రుబిన్‌ తయారవుతుంది.

మలేరియా, థలసేమియా…..
ఈ వ్యాధుల వల్లగానీ లేదా కొన్ని రకాల అల్లోపతి బౌషధాల వల్ల ఎర్రరక్తకణాలు భారీగా విచ్చిన్నమవుతాయి.

గిల్బర్ట్‌ సింద్రోమ్‌: వంశపారంపర్యంగా ఏర్పడే ఈ పరిస్థితి వల్ల పైత్యరసాన్ని విడుదల చేయగల ఎంజైముల సామర్థ్యం దెబ్బతింటుంది.

కొలెస్టాటిస్‌: ఈ కండిషన్‌లో కాలేయం నుంచి పైత్యరసం విడుదలకు అడ్డంకులు ఏర్పడతాయి. దాంతో కాంజెగేటెడ్‌ బైలిరుబిన్‌ విసర్జితం కావడానికి బదులు కాలేయంలోనే ఉండి పోతుంది.

వయోజనుల్లో మరికొన్ని తీవ్రమైన కారణాల వల్ల కామెర్ల వ్యాధి వస్తుంది. వీటిలో కొన్ని ప్రాణాంతకమైన పరిస్థితులకూ దారితీయవచ్చు.

మితిమీరిన మద్యపానం (నాలుగేళ్లకు పైబడి),

హెపటైటిస్‌ బి, సి వైరస్‌ల ఇన్ఫెక్షన్‌ల వల్ల ఎక్కువమంది కామెర్ల వ్యాధికి గురవుతుంటారు.

హెపటైటిస్‌ ఏ, ఈ వైరస్‌ల వల్ల కూడా కామెర్లు వస్తాయి.
ఇవి ప్రమాదకరం.

కలుషితమైన నీళ్లు, తిండి వల్ల ఈ తీవ్రమైన హెపటైటిస్‌ ఏ, ఈ వైరస్‌లు శరీరంలోకి చేరుతుంటాయి.

కామెర్ల వ్యాధిని నిర్ధారించటం ఎలా ?

చాలా సందర్భాల్లో పేషెంట్ ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం, భౌతికంగా పరీక్షీంచడం, పొట్టదగ్గర పరిశీలించడం ద్వారా డాక్టర్లు కామెర్ల వ్యాధిని గుర్తిస్తారు.

పొట్టలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, కాలేయం గట్టిపడిందా అని పరిశీలించి చూస్తారు.
కాలేయం గట్టిగా మారడం సిర్రోసిస్‌ వ్యాధిని సూచిస్తుంది. అది అలా గట్టిగా మారడం క్యాన్సర్‌ లక్షణం.
కామెర్ల తీవ్రతను తెలుసుకోడానికి చాలా రోగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయి. వీటిలో మొదటిది లివర్‌ ఫంక్షన్‌ పరీక్ష. కాలేయం సరిగా పనిచేస్తున్నదీ లేనిదీ దీనితో వెల్లడవుతుంది.
రోగిలో వ్యక్తమవుతున్న లక్షణాలకు కారణాలు బయటపడని పక్షంలో బైలిరుబిన్‌ పరిమాణం, రక్తపు తాజా పరిస్థితిని అర్ధం చేసుకోడానికి బైలురుబిన్‌ టెస్ట్‌, వుల్‌ బ్లడ్‌ కౌంట్‌, కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్‌, హెపటైటిస్‌ వైరస్‌ల పరీక్షల వంటి వివిధ రకాల పరీక్షలను డాక్టర్లు సూచిస్తారు.

నాళాలకు అడ్డంకులు ఏర్పడిన కారణంగా కామెర్లు వచ్చినట్లు అనుమానిస్తే ఎమ్మారై స్కాన్‌, అబ్బామినల్‌ అల్ట్రాసోనోగ్రఫీ,కాట్‌స్కాన్‌ వంటి పరీక్షలు చేయవలసి ఉంటుంది.
సిర్రోసిస్‌, క్యాన్సర్‌, ఫాటీలివర్‌ ఏర్పడినట్లు అనుమూనం కలిగితే బయాప్సీ చేయించాల్సిందిగా సూచిస్తారు.

Jaundice కామెర్ల వ్యాధి వ్యాధి చికిత్సలు ఏమిటి ?

చాలామంది అవగాహన లేక జాండిస్‌కు హానికరమైన మందులు వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా. Jaundice కామెర్ల వ్యాధికి ఆయుర్వేదంలో మంచి చికిత్స ఉంది.

కామెర్లకు సరైన చికిత్స తీసుకోకపోతే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. కామెర్లకు చికిత్స చేసే ముందర ఆ వ్యాధికి దారితీసిన కారణాలను గుర్తించేందుకు పరీక్షలు జరుపుతారు. వాటిని అదుపు చేయడం, నివారించడానికి చికిత్స చేస్తారు.

రక్షహీనత కారణంగా ఏర్పడిన కామెర్లను రక్తంలో ఎర్రరక్తకణాలను అభివృద్ధిపరచడం ద్వారా అదుపుచేస్తారు. ఇందుకు ఐరన్‌ సప్లిమెంట్లు, ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

అల్లోపతి వైద్యం లో…

హెపటైటిస్‌ కారణంగా వచ్చే కామెర్లను తగ్గించడానికి యాంటీ వైరల్‌ మందులు, స్టెరాయిడ్స్‌ ఇస్తారు. నాళాలలో అడ్డంకుల కారణంగా కామెర్లు వస్తే, శస్త్రచికిత్స ద్వారా ఆ ఆటంకాలను తొలగిస్తారు.

ఏమైనా మందులు వాడటం వలన వాటిలోని రసాయనాల వల్ల కామెర్లు వస్తే మొదట వాటి వాడకాన్ని నిలిపేస్తారు. ప్రత్యామ్నాయ మందులు సిఫార్సు చేయడంతో పాటు వాటి దుష్ఫలితాలను తగ్గించేందుకు అవసరమైన చికిత్స అందిస్తారు.

హెపటైటిస్‌ ఏ, ఈ వైరస్‌ల వల్ల వచ్చే కామెర్లు చాలా ప్రమాదకరం. దీనిలో హఠాత్తుగా కామెర్ల వ్యాధి సోకి ప్రాణాపాయ ప్రమాదం ముంచుకువచ్చే అవకాశం ఉంది.

కాలేయ మార్పిడి మాత్రమే దీనికి నమ్మకమైన చికిత్స. సజీవులై వారి నుంచి లేదా ట్రెయిన్‌డెడ్‌ అయిన దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కాలేయంతో అవయవమార్చిడి ఆపరేషన్‌ చేస్తారు.

ఆయుర్వేద చికిత్స : 

Jaundice కామెర్ల వ్యాధి ఎంతకాలం నుంచి ఉన్నా, ఎంత తీవ్రంగా ఉన్నా చాలా త్వరగా మరియు శాశ్వతంగా నిర్మూలించడం ఆయుర్వేద వైద్యానికి మాత్రమే సాధ్యం.

Jaundice కామెర్ల వ్యాధి వలన వచ్చేటటువంటి అన్ని రకాల అనారోగ్య సమస్యలను అద్భుతంగా నివారించడం సాధ్యమే.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..

వివరాలకు….

వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..

Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700

Website
https://mathrusreeayurveda.com/home/

Facebook :

https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL

https://www.facebook.com/mathrusreeayurveda/

https://m.facebook.com/doctorayurvedaandsiddha

https://m.facebook.com/ayurvedaandsiddha

Youtube:

https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg

Email :

drmahesh@mathrusreeayurveda.com

80 thoughts on “Jaundice కామెర్ల వ్యాధి”

  1. What i don’t realize is if truth be told how you’re now not actually much more well-preferred than you might be now. You are so intelligent. You recognize thus significantly in relation to this topic, produced me in my opinion believe it from a lot of various angles. Its like women and men aren’t interested unless it’s one thing to accomplish with Lady gaga! Your individual stuffs nice. Always maintain it up!

    Reply
  2. Hello, you used to write fantastic, but the last few posts have been kinda boring… I miss your super writings. Past few posts are just a little out of track! come on!

    Reply
  3. Hiya! Quick question that’s totally off topic. Do you know how to make your site mobile friendly? My website looks weird when viewing from my iphone. I’m trying to find a template or plugin that might be able to correct this issue. If you have any recommendations, please share. With thanks!

    Reply

Leave a comment

Open chat
1
మీ పేరు,వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
సాధ్యమయినంత త్వరలో స్పదించగలము.

దయచేసి,పూర్తి వివరాల కొరకు Dr.Mahesh గారిని సంప్రదించగలరు.
cell no: 9701965700 ; 8686622900

సంప్రదించవలసిన వేళలు: 11 Am to 8 PM
సంప్రదించినందులకు ధన్యవాదాలు.