Pepper మిరియాలు వేడి చేస్తాయా?

Social Share

pepper మిరియాలు వేడి చేస్తాయా?
Think and Think

 pepper మిరియాలు వేడి చేస్తాయా?
Pepper మిరియాలు వేడి చేస్తాయా?

మిరియాలు వేడి చేస్తాయా?

అయ్యో! శ్రీరామ నవమినాడు చలువచేసే పానకంలో ప్రధాన వస్తువుగా వేడి చేసే మిరియాలనెందుకు కలుపుతున్నారో?

అరే! బెల్లం కూడా వేడి చేస్తుందటగా?

ఆ మధ్య ఈ మధ్య కొంత మంది పానకంలో యాలకులను కూడా వాడుతున్నారు. మరి యాలకులు వేడిచేస్తాయని కొందరంటుడగా విన్నాను.

పానకం ….. నీళ్ళు, మిరియాలు, యాలకులు ఇవి ప్రధాన వస్తువులు. ఈ మధ్య కొందరు నిమ్మ రసం కూడా కలుపుతున్నారటగా….. జలుబు చెయ్యదూ? వేడి జలుబు అంటూ ఒకటుందటగా?

అసలయినా చలువచేస్తాయని వాడే పానకంలో వేడి చేసే వస్తువులు వాడమని చెప్పిన ఆయుర్వేద మహర్షులని అనాలి…

ఇంతకీ అసలు పానకం వేడి చేస్తుందా? చలువ చేస్తుందా?
మిరియాలు, బెల్లం?

మనకు లభించే మిరియాలను సాధారణంగా నల్ల మిరియాలు అంటారు. వీటిని నానబెట్టి పొట్టు తీసి ఎండబెట్టితే తెల్ల మిరియాలు అని అంటారు. ఈ తెల్ల మిరియాలు కాస్తంత సౌమ్యంగా పనిచేయను. వీటినే మేధావులు చలువ మిరియాలు అని అంటారు. కొన్ని ప్రాంతాలలో ఎర్ర మిరియాలు కూడా పండుతున్నాయి. కానీ వీటన్నింటి లక్షణం ఒకటే. రుచిలో మాత్రం కొద్దిపాటి భేదం ఉంటుంది.

పైల్స్ (piles) :

కాస్తంత వేడి చేస్తే చాలు ఈ వ్యాధి తన విశ్వరూపం చూపిస్తుంది. అదేంటో మరి ఈ వేడి చేసే మిరియాలు ఆ వేడి వల్ల వచ్చే మూలశంఖ హింసని ఎలా పోగుడుతుందో చూద్దాం…..

10 గ్రాములు మిరియాలు, 15 గ్రాములు సోపు గింజలు ఈ రెండింటినీ మెత్తగా చూర్ణం చేసి 75 గ్రాములు తేనె కలిపి, పూటకు 5 గ్రాములు చొప్పున రోజుకి రెండు లేదా మూడు పూటలు వాడినచో ప్రత్యేకంగా బలహీనంగా ఉన్నవారు మరియు వృద్ధులకు అలాగే ఎవరికైనా సరే మూలశంఖ (piles) పెట్టే హింస నుండి విముక్తి లభిస్తుంది.

మరి ఇప్పటికీ మిరియాలు వేడి చేస్తాయా…?
ఇందులో కలిపిన సోపు గింజల సంగతి తర్వాత చూద్దాం… మరి తేనె వేడి చేయ్యదూ…?

కాళ్లు చేతుల మంటలు:

3 గ్రాములు మిరియాలను చితకగొట్టి, 10 గ్రాముల ఆవు నెయ్యిలో వేసి కాచి చల్లారనిచ్చి వడపోసుకుని ఆ నెయ్యితో మర్దన చేస్తే ఆశ్చర్యంగా కాళ్లు చేతుల మంటలు తగ్గును. సాధారణంగా వేడి చేస్తేనే అరికాళ్లు,అరి చేతులు మంటలు వస్తాయి. మధుమేహ వ్యాధి పీడితులకు సైతం ఈ బాధ తరచూ వేధించేదే. రకరకాల కారణాలు.

అయ్యో ఏంటో మరి ఇప్పటికీ మిరియాలు వేడి చేస్తూనే ఉన్నాయి…! అర్రరే… ఇక్కడ ఆవు నెయ్యి కూడా చెప్పారే… అబ్బా…! ఇది కూడా వేడి చేస్తుందట కదా..?

జలుబు:

ఏంటో ఈ మధ్య విపరీతంగా వింటున్నాం…. వేడి జలుబు చేసిందట….. మిరియాల పాలు తాగొచ్చట! ఆ వేడి జలుబు తగ్గిపోతుందట! అల్లం టి, శొంఠి కాఫీ ఇవి కూడా ఆ వేడి జలుబును తగ్గిస్తాయట!

ఇది మరీ విచిత్రంగా లేదూ….? మిరియాలు వేడి చేస్తాయి, అల్లం వేడి చేసేదే, అల్లాన్ని ఉడకబెట్టి ఎండబెట్టడం ద్వారా తయారైనటువంటి శొంఠి కూడా వేడి చేసేదే…!

ఇది ఎలా అంటే …. Two ‘pluses’ make a plus, two ‘minuses’ make a plus. A plus and a minus make a minus లాంటి తుగ్లక్ ఈక్వేషన్స్ బాగానే చెబుతారు …!

కానీ, మిరియాలు వేడి చేస్తాయా లేదా అనే అంశంపై సరైన అవగాహన ?

అసలు ఇంతకీ వేడి చేయడం అంటే…? పెనం మీద వేసి కాల్చడమా…? లేక పొయ్యిలో వేసి కాల్చడమా…?

అల్లోపతి సైన్స్ ప్రకారం వేడి చేయడం అనేది లేదు. ఆయుర్వేద వైద్యం వేడి చేస్తుందనే మేధావులు విదేశీ వైద్యమైన అల్లోపతి వైద్య విధానాన్ని అపారంగా విపరీతంగా ఇష్టపడతారు. ఆయుర్వేదాన్ని తప్పు పడతారు.

అది సరే ఇంతకీ మిరియాలు వేడి చేస్తాయా?

please comment …. What do you THINK …..

వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..

Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700

Website
https://mathrusreeayurveda.com/home/

Facebook :

https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL

https://www.facebook.com/mathrusreeayurveda/

https://m.facebook.com/doctorayurvedaandsiddha

https://m.facebook.com/ayurvedaandsiddha

Youtube:

https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg

Email :

drmahesh@mathrusreeayurveda.com

Leave a comment

Open chat
1
మీ పేరు,వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
సాధ్యమయినంత త్వరలో స్పదించగలము.

దయచేసి,పూర్తి వివరాల కొరకు Dr.Mahesh గారిని సంప్రదించగలరు.
cell no: 9701965700 ; 8686622900

సంప్రదించవలసిన వేళలు: 11 Am to 8 PM
సంప్రదించినందులకు ధన్యవాదాలు.