Tonsils Adenoids టాన్సిల్స్ ఎడినాయిడ్స్ సమస్యలకు అత్యుత్తమ శాశ్వత పరిష్కారం
రక్షక భటుల మాదిరిగా పనిచేస్తూ, వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడటంలో టాన్సిల్స్, ఎడినాయిడ్స్‌ల పాత్ర కీలకం. ఇంతటి ముఖ్యభూమిక పోషించే టాన్సిల్స్, ఎడినాయిడ్స్‌కు ఇన్‌ఫెక్షన్ సోకితే… ఇంకేముంది? శరీరంలోకి అనేక వ్యాధికారక క్రిములు అడ్డూ ఆపూ లేకుండా ప్రవేశించి, అనేక వ్యాధులను తెచ్చిపెడతాయి.
ఫలితంగా శరీరం మొత్తం రోగాలమయం అవుతుంది. అయితే టాన్సిల్స్, ఎడినాయిడ్స్‌కు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడుతూ, అనారోగ్యం దరిచేరకుండా చూడటంలో ఆయుర్వేద చికిత్స అత్యుత్తమం.
టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అనేవి శరీర రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్యమైన కణజాల సమూహం. టాన్సిల్స్ గొంతు వెనక భాగంలో, ఎడినాయిడ్స్ ముక్కు, నోటి పైభాగంలో ఉంటాయి.
ఈ రెండూ కూడా రకరకాల బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే ముఖ్యమైన శరీర వ్యవస్థలు. అయితే వీటి పనితనం చిన్న వయసులోనే కనిపిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వీటి పరిమాణం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
ఇన్‌ఫెక్షన్ లక్షణాలు :
ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు కనిపించే ప్రథమ లక్షణం గొంతు నొప్పి. అయితే ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించే ప్రక్రియలో వీటి పరిమాణం పెరగడం జరుగుతుంది. జ్వరం, నోటి దుర్వాసన, జలుబుతో ముక్కు మూసుకుపోవడం, గొంతు, మెడలో ఉండే గ్రంథులలో వాపు రావడం, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తలనొప్పి, కడుపునొప్పి, దగ్గుతో పాటు కఫంలో రక్తం కనిపించడం, స్వరంలో మార్పు రావడం, నోటి ద్వారా గాలి పీల్చాల్సి రావడం, గురక, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లేకపోవడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
ప్రధాన రకాలు:
ఎక్యూట్ టాన్సిలైటిస్ : బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల ప్రారంభమై జ్వరంతో పాటు గొంతువాపు, చెవినొప్పి, ఒంటినొప్పులు ఉంటాయి. నోటి దుర్వాసన వస్తుంది.
క్రానిక్ టాన్సిలైటిస్ : దీర్ఘకాలంగా ఇన్‌ఫెక్షన్లు ఉండటం వల్ల తరచూ జ్వరం రావడం, చిన్న చిన్న రాళ్లు టాన్సిల్స్‌లో ఏర్పడటంలాంటివి కనిపిస్తూ శరీర ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
పెరి టాన్సిలార్ అబ్సెస్ : టాన్సిల్స్‌లో చీము ఏర్పడి, కొండనాలుకపై ఒత్తిడి ఏర్పడి విపరీతమైన నొప్పి మొదలవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెంది ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.
దుష్ప్రభావాలు :
చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే కీళ్లవాతం, సైనసైటిస్, చెవి సంబంధ ఇన్‌ఫెక్షన్, న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులు రావడం, కిడ్నీలు పనిచేయకపోవడం, శారీరక ఎదుగుదలపై ప్రభావం పడటం వంటి సమస్యలు వచ్చిపడతాయి.
ఇవి అంటువ్యాధులా?
బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. అయితే వ్యక్తి రోగ నిరోధకశక్తి , గ్రహణ శీలత ప్రాముఖ్యాన్ని బట్టి అనారోగ్యం వాటిల్లుతుంది.
నిర్ధారణ :
బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్ కొద్దిపాటి జ్వరంగా మొదలై గొంతునొప్పితో కూడి ఉంటుంది. వైరస్‌ల ప్రభావంతో వచ్చే ఇన్‌ఫెక్షన్‌లో గొంతునొప్పి, జలుబు, తుమ్ములు, దగ్గు వంటివి కనిపిస్తాయి.
అంతేకాకుండా గొంతు పరిశీలించడం, రక్తపరీక్షలు, ఎక్స్‌రే ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు.
జాగ్రత్తలు :
కారణం ఏదైనా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు చేతి రుమాలు అడ్డంపెట్టుకోవాలి. కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగాలి.
రోగనిరోధక శక్తిని పెంచే ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు వేడినీళ్లలో ఉప్పు వేసి రోజూ నాలుగైదు సార్లు పుక్కిలించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
ఆయుర్వేద చికిత్స :
ఆయుర్వేద ఒౌషధాలు ఇన్‌ఫెక్షన్‌ని పూర్తిగా నిర్మూలించడంతో పాటు తిరిగి అనారోగ్యం బారినపడకుండా కాపాడ తాయి.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే దుష్ప్రభావాలూ లేకుండా పూర్తిగా సురక్షితమైన విధానంలో రోగి శరీరతత్వాన్ని తిరిగి యథాస్థానంలోకి తీసుకురావడం ఆయుర్వేద చికిత్స విశిష్టత.
అయితే ప్రతి రోగిలో సామాన్య రోగ లక్షణాలతో పాటు భిన్నమైన లక్షణాలు కూడా కలిసి ఉంటాయి.
ఆ లక్షణాలను గుర్తించి తగిన ఒౌషధాలు ఇచ్చినప్పుడు మాత్రమే శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ఆయుర్వేద చికిత్సలో ఇదే విధానాన్ని అనుసరించడం జరుగుతుంది.అందుకే అద్భుతమైన ఫలితాలు పొందుతుంటారు.
అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ఆపరేషన్ చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు.
ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు.
అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది.
ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..
వివరాలకు….ఆయుర్వేద శాస్త్రమ్ పేజిలోని call now option ద్వారా మీ యొక్క సందేహాలను ఇతర వివరాలను అడిగి తెలుసుకునే అవకాశం వుంది.
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Website
https://mathrusreeayurveda.com/home/
Facebook :
https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL
https://www.facebook.com/mathrusreeayurveda/
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
Email :