Uggupaalu ఉగ్గుపాలు

Social Share

Uggupaalu ఉగ్గుపాలు…..ఉగ్గుపాలు అంటే ఏంటి? అందులో ఉపయోగించే పదార్ధాలు ఏంటి? వాటి ఉపయోగాలేంటో తెలుసుకుందాం…….

Uggupaalu ఉగ్గుపాలు
Poojitha

 

Uggupaalu ఉగ్గుపాలు :

ఉపయోగాలు:

బాల్యంలో జీవశక్తి ( రెసిస్టెన్సీ పవర్ , ఇమ్యూనిటి, వ్యాధి నిరోధక శక్తి ) ని సహజ సిద్ధంగా పెంపొందించుటకు ఉపయోగించే దివ్యెౌషధాన్నే ” ఉగ్గుపాలు” అంటారు.
దీనిని వాడడం వలన పసిపిల్లల వయస్సు నుండే వ్యాధి నిరోధక శక్తి తగినంత కలిగివుండి తరచూ జబ్బు పడుటను నిరోధిస్తుంది. దురదృష్టవశాత్తు ఏదైనా వ్యాధి పీడితులైనా అతి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది.

పసిపిల్లల్లో వచ్చే దృష్టి మాంద్యం, అధిక బరువు, దగ్గు, జలుబు, పాల ఉబ్బసం, ఉబ్బసం, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం, మూర్చలు, మంద బుద్ధి, ఙ్ఞాపక శక్తి తక్కువగా వుండడం, ఆటిజం, గజ్జి, తామర, దద్దుర్లు, మొదలగు చర్మ వ్యాధులు, కామెర్లు, ఉబ్బు కామెర్లు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు మొదలగు వ్యాధుల బారిన పడకుండా రక్షించే సహజ సిద్ధ రక్షా కవచం ” ఉగ్గుపాలు” అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

21 రోజుల వయస్సు నుండి 3 సం||ల వయస్సు వరకు వాడదగినది.

“ఉగ్గుపాలలో” ఉపయోగించే వస్తువులు:
1) వాము:

వాతశ్లేష్మములనణచును. కడుపు నొప్పిని తగ్గించును. నులి పురుగులను, ఏలిక పాములను రానివ్వకుండును. వాంతులు, విరేచనాలను అరికట్టును.
జీర్ణ వ్యవస్ధను బాగుచేయును.

2) కురాసాని వాము:

చక్కగా నిద్ర పట్టించును, కడుపులో పుట్టే హానికరమైన క్రిములనన్నింటిని పోగొట్టును. ప్రేగులను శుభ్ర పరచును.

3) కురంజి వాము:

పొత్తి కడుపులో ఏర్పడే నుసి పురుగులనెడి క్రిములను పోగొట్టుటకు ఇది పెట్టింది పేరు. సర్వ జీర్ణ వ్యాధులను తగ్గించును. మూత్ర మరియు మల ద్వార సంబంధిత వ్యాధులను తగ్గించును.

4) వస:

వాత పిత్త శ్లేష్మ దోషములను పోగొట్టును. కంఠమునకు హితకరమైనది. బుద్ధి మాంద్యమును పోగొట్టును. మాటలు త్వరగా చక్కగా వచ్చుటకు ఉపయోగపడును. ఙ్ఞాపక శక్తి పెంపొందించుటకు బహు ఉపయోగకారి. చిన్న పిల్లల చేస్టాలు అనెడి వ్యాధి, మూర్చలు, ఆటిజం అను వ్యాధులను రానివ్వకుండును.

5) కరక్కాయ:

కన్నులకు చాలా హితకరమైనది. దృష్టిమాంద్యంను రానివ్వకుండును. దగ్గు, ఆయాసంలను నివారించును. జ్వరములను తగ్గించును. రేచీకటిని దరిచేరనివ్వదు.

6) తానికాయ:

త్రిదోషములను హరించును. గొంతు బొంగురు పోవుట అను రోగమును పోగొట్టును. తల వెంట్రుకలను వృద్ధి చేయును. ఎర్రని తల వెంట్రుకలను నల్లగా చేయును. బాల నెరుపును రానివ్వకుండును. దప్పికను తగ్గించును. నోటిలోని, కడుపులోని పుండ్లను తగ్గించును. పుప్పి పళ్ళ సమస్యను రాకుండా చేయును.

7) శొంఠి:

రుచిని పుట్టించును. పైత్యమును తగ్గించును. రక్త క్షీణతను రాకుండా చేయును. జఠరాగ్నికిది ఉత్తమమైనది.

8) మిరియాలు:

ఫుడ్ పాయిజనింగ్ ను పోగొట్టును. అత్యుష్ణమును నివారించును. చర్మ దోషములను పోగొట్టును. జ్వరమును తగ్గించును. లివర్ , స్ల్పీన్ వ్యాధులను అరికట్టును. చికెన్ పాక్స్ , స్మాల్ పాక్స్ వ్యాధులను రాకుండా రక్షించును.

9) పిప్పళ్ళు:

శ్వాసకోశ వ్యాధులు రాకుండా రక్షించును. దగ్గును తగ్గించును. కామెర్లు రాకుండా చేయును. ఆహారం లేదా పాలు తీసుకున్న తరువాత అయ్యే వాంతులు మరియు విరేచనాలను అవ్వకుండా చేయును. పాల ఉబ్బసాని దరిజేరనివ్వకుండును.

10) మోడి:

క్షయ, నిమోనియా వ్యాధులు రాకుండా రక్షించును.
డస్ట్ అలర్జీని రాకుండా కాపాడును. ధనుర్వాతం, మసూచి అను వ్యాధులను రానివ్వదు. కాళ్ళు చేతులు పడిపోవుట అను వ్యాధిని రానివ్వదు. ఎముకలకు, నరములకు మంచి శక్తిని ఇచ్చును.కీళ్ళ వాతమును రానివ్వదు.

11) మోదుగమాడ:

గజ్జి, తామర, సోభి, దురదలు, దద్దుర్లు మొదలను చర్మ వ్యాధులను రానివ్వదు. కలరా, మలేరియా వ్యాధులను రాకుండా రక్షించును. వినికిడి లోపము రాకుండా చేయును. చెవిలో చీమును తగ్గించును. చుండ్రు రాకుండా చేయును.

12) సునాముఖి:

ఆహారమును చక్కగా జీర్ణము కావించి సుఖ విరేచనము చేయును. రక్త శుద్ధి, రక్త వృద్ధి చేయును. బొల్లి వ్యాధిని రానివ్వదు. దేహమును మృదువుగా మరియు కాంతి వంతముగా వుంచును. చర్మ ఆరోగ్యమును రక్షించును.

13) ఆముదం:

సమస్ధ వాతములను పోగొట్టును. దీనికి వాతారి, వాతానికి శతృవు అను పేర్లు కలవు. ప్రేవులలో మలము పేరుకుపోవుటను నివారించును. గ్యాష్ట్రిక్ ట్రబుల్ , అల్సర్ అను వ్యాధుల బారిన పడకుండా రక్షించును. టిన్సిల్స్ , ఎడినాయిడ్స్ , వివిధ రకాలైన కంతులను రానివ్వకుండా రక్షించును. మెదడు వాపు వ్యాధిని రానివ్వదు. డెంగ్యూ, గునియా, స్వెైన్ ఫ్లూ వ్యాధులను దరిజేరనివ్వదు. కీళ్ళ వాతమును, కండర వాతమును నిశ్శేషముగా పోగొట్టును. మస్క్యిలర్ డెస్ట్రొఫీ అను సర్వాంగ వాతవ్యాధిని రానివ్వకుండా రక్షించును. శరీరంలోని సమస్ధ అవయవములకు మేలు చేయును. చలువ చేయును.
ఆముదం ఆరోగ్యమును కాపాడడంలో అత్యంత శ్రేష్టమైనది. దీని వాడుకలో ఏవిధమైన హాని లేదు.

వాడవలసిన విధానం:

పైన చెప్పబడిన దినుసులనన్నింటిని సమభాగాలుగా కలిపి చూర్ణించి సీసాలో భద్ర పరచుకోవాలి.

ప్రతి రోజు ఉదయం వడ్ల గింజ ప్రమాణం నుండి వయస్సు రీత్యా శనగ గింజ ప్రమాణం వరకు తీసుకుని

5 చుక్కల నుండి వయస్సును బట్టి 10 చుక్కలు ఆముదం, 5ml నుండి 10ml తల్లి పాలు లేదా ఆవు పాలతో కలిపి త్రాగించాలి.

కొన్ని ప్రాంతాలలో పైన చెప్పబడిన వస్తువులే కాక మరికొన్నింటిని కూడా కలిపి వాడుట కలదు.

అలాగే పైన చెప్పబడిన కొన్ని వస్తువులకు బదులు వేరే వస్తువులను వాడుట కలదు. ఆ పద్దతులలో కూడా ఏవిధమైన దోషం లేదు. ఆచరించవచ్చు.

ఆయుర్వేదోద్యమంలో భాగస్వామ్యులమౌదాం…..
ఆరోగ్య భారతాన్ని నిర్మించుకుందిం…..

వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..

Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700

Website
https://mathrusreeayurveda.com/home/

Facebook :

https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL

https://www.facebook.com/mathrusreeayurveda/

https://m.facebook.com/doctorayurvedaandsiddha

https://m.facebook.com/ayurvedaandsiddha

Youtube:

https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg

Email :

drmahesh@mathrusreeayurveda.com

Leave a comment

Open chat
1
మీ పేరు,వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
సాధ్యమయినంత త్వరలో స్పదించగలము.

దయచేసి,పూర్తి వివరాల కొరకు Dr.Mahesh గారిని సంప్రదించగలరు.
cell no: 9701965700 ; 8686622900

సంప్రదించవలసిన వేళలు: 11 Am to 8 PM
సంప్రదించినందులకు ధన్యవాదాలు.