colon ulcers ప్రేగుపూత మంట…. ఇది తీవ్రమైన సమస్య. దీన్ని వైద్య పరిభాషలో అల్సరేటివ్ కోలిటిస్ అని అంటారు. ప్రేగులలో మంట, పూత, చికాకు కారణంగా దీన్ని ఇన్ఫ్లమేటరి బొవెల్ డిసీజెస్ (IBD) అని పిలుస్తారు.
colon ulcers ప్రేగుపూత మంట
అల్సర్ల పరిష్కారానికి ఆయుర్వేదమే ఉత్తమం
చాలాకాలంగా బాధపడుతున్నా కొందరు తమకు అల్సర్ ఉందన్న విషయాన్నే గుర్తించరు. ఇదేదో గ్యాస్ట్రిక్ సమస్యేలే అనుకుని అలాగే ఉండిపోతారు. ఇలాంటి వారిలో అల్సర్ పెరిగిపెరిగి పెద్ద రంధ్రం బడి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల బారిన (పెరిటోనైటిస్) పడవచ్చు. శరీరంలోని కీలక భాగాలన్నీ దెబ్బతిని ఒక్కోసారి ప్రాణాపాయమే ఏర్పడవచ్చు.
ఎవరైనా యాంటాసిడ్ మాత్రలతో కాలయాపన చేయాలనిచూస్తే అల్సర్ కేన్సర్‌గా మారే ప్రమాదమూ ఉంది. అందుకే అల్సర్ లక్షణాలు కనిపించిన మరుక్షణమే ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తే అల్సర్‌ల నుంచి శాశ్వత విముక్తిని పొందవచ్చని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
పొద్దుపొద్దున్నేతీవ్రమైన సమస్యగా….
అలార్మ్ క్లాక్‌కన్నా ముందుగా మీ కడుపు నొప్పి మీరు కళ్లుతెరిచేలా చేస్తుంది. రోజుకు అరడజను యాంటాసిడ్ మాత్రలు కడుపులోకి జారుతూనే ఉంటాయి. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తూనే ఉంటుంది. ప్రతిరోజూ రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే సమయంలో ‘‘నా ఆహారపు అలవాట్లన్నీ సమూలంగా మార్చేసుకోవాలి లేకపోతే నేనింక బతకలేను’’ అనుకున్నాడు.
అంతవరకే చూస్తే అతనిలో ఎంతో పరివర్తన వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ, ఆ మరుసటి రోజున మళ్లీ మామూలే. ఫాస్ట్ ఫుడ్‌లు, మసాలా తిళ్లూ ఏ ఒక్కటీ మిస్సయిపోదు.
కొంతమంది స్త్రీలు ఉపవాసాల పేరిట, ఒక్కపొద్దుల పేరిట, పని ఒత్తిళ్ల పేరిట ఎంతో మంది వారానికి నాలుగు రోజులు వేళకు బోంచేయక ఈ అల్సర్ బారిన పడుతుంటారు. రాత్రివేళ కూడా వదలని నిరంతరపు కడుపు నొప్పితో నిద్రలేమి సమస్య మొదలవుతుంది. దీంతో మొత్తం జీవక్రియల్లోనే తేడా వస్తుంది.
ఎందుకిలా?
అల్సర్లు రెండురకాలు. వాటిలో ఒకటి జీర్ణాశయంలో వచ్చే గ్యాస్ట్రిక్ అల్సర్. రెండవది చిన్నపేగులో వచ్చే డియోడినల్ అల్సర్. ఈ రెండింటినీ కలిపి పెప్టిక్ అల్సర్ అంటారు. మనం తీసుకునే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి రోజూ చేసే భోజనవేళల్లో శరీరం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తూ ఉంటుంది.
ఈ ఆమ్లం ఆహారాన్ని అత్యంత సూక్ష్మభాగాలుగా విడదీస్తుంది. దీనికితోడు పెప్సినోజిన్ అనే ఆమ్లం కూడా ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటుంది. జీర్ణాశయంలో పేగుల్లో మ్యూకస్ మెంబ్రేన్ అనే పల్చటి పొర ఉంటుంది. వేళకు భోంచేస్తే ఆమ్లాలు ఆ ఆహారాన్ని విభజించే పనిలో పడతాయి.
భోజనం చేసినా, చేయకపోయినా ఆ నిర్ధిష్టవేళల్లో విడుదల అయ్యే ఆ ఆమ్లాలు ఒకవేళ ఆ సమయంలో ఏమీ తినకపోతే, లోపలున్న మ్యూకస్ మెంబ్రేన్‌ను దెబ్బ తీస్తాయి.
ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే, దెబ్బతిన్న మ్యూకస్‌మెంబ్రేన్‌ను హెచ్-పైలోరి అనే బ్యాక్టీరియా ఆ భాగాన్ని ఆవహించి అల్సర్ అయ్యేలా చేస్తుంది. ఈ అల్సర్ ఎక్కువ కాలం అలాగే కొనసాగితే అది కేన్సర్‌గా మారే ప్రమాదం కూడా ఉంది.
ఎలా తెలుస్తుంది?
కడుపు నొప్పితో పాటు ఛాతీలో నొప్పి, మంటా ఏర్పడతాయి. కడుపులో ఉబ్బరం, ఒక అసౌక ర్యంగా అనిపిస్తుంది. అల్సర్లతో తరుచూ రక్తస్రావం కావడం వల్ల రక్తహీనత కూడా రావచ్చు.
అల్సర్లతో కొందరిలో ఖాళీ కడుపున ఉన్నప్పుడు కడుపు నొప్పి వస్తే, కొందరిలో ఏమైనా తిన్నప్పుడు నొప్పి వస్తుంది. అల్సర్ల కారణంగా నోటి దుర్వాసన కూడా రావచ్చు.
అల్సర్లు ఏర్పడ్డాక గానీ, ఏర్పడటానికి ముందు గానీ, ఇలా దుర్వాసన రావచ్చు. వీపు వెనుక రెండు జబ్బల మధ్య పట్టేసినట్లు అనిపిస్తుంది.
వీళ్లల్లో మలబద్దకం గానీ, విరేచన సమస్యగానీ ఉండవచ్చు.
వికారమూ, వాంతులూ ఉండవచ్చు. అలాగే ఆకలి తగ్గడం, అజీర్తి సమస్య రావచ్చు. ఏ కొంచెం తిన్నా కడుపు పూర్తిగా నిండిపోయిన భావన కలుగుతుంది.
కొందరిలో అస్తమానం నీళ్లూ ఊరడం కూడా కనిపిస్తుంది. ఇదీ అల్సర్ లక్షణమే.
అల్సర్ వల్ల బరువు తగ్గడంతోపాటు కొందిరిలో నీరసం నిస్సత్తువా ఉంటాయి. కొందరిలో తలనొప్పి, పార్శ్వపు నొప్పి కూడా రావచ్చు. వీటితోపాటే దిగులూ ఆందోళన కూడా ఉంటాయి.
చర్మ సమస్యలు, రుతుక్రమంలో తేడాలు ఇవన్నీ తలెత్తే ప్రమాదం ఉంది.
అసలైన వైద్యం
అల్లోపతి విధానంలో యాంటాసిడ్స్ ఇవ్వడం అనేది సమస్యను తటస్థంగా ఉంచడానికి మాత్రమే. అయితే ఈ యాంటాసిడ్స్ వల్ల తాత్కాలిక ఉపశమనమే లభిస్తుంది. యాంటీబయాటిక్స్ వల్ల హెచ్‌పైలోరి బ్యాక్టీరియా అయితే చనిపోవచ్చు.
ఆయుర్వేద చికిత్స:
కానీ, మ్యూకస్ మెంబ్రేన్ పొర దెబ్బ తిన్న కారణాన్ని మాత్ర వాళ్లు పట్టించుకోవడం లేదు. ఆయుర్వేదం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఆయుర్వేదం మొత్తం జీర్ణవ్యవస్థను పెద్దపేగు,చిన్న పేగు వ్యవస్థలన్నిటినీ చక్కబరుస్తుంది.
జఠరాగ్నిని ఉత్తేజితం చేయడం ద్వారా మొత్తం జీర్ణవ్యవస్థనే శక్తివంతంగా మార్చగలుగుతున్నాం. ఆయుర్వేదంతో అల్సర్ సమస్య సమూలంగా పోవడమే కాదు.
మీ ఆకలి, మీ జీర్ణశక్తి పెరిగి మీ జీవితం తిరిగి ఒక గొప్ప ప్రామాణికతను సంతరించుకోవడానికి ఆయుర్వేదం అండగా నిలబడుతుంది.
ఆయుర్వేదం హెచ్ పైలోరా ఇన్‌ఫెక్షన్లను తొలగించి, అల్సర్ లక్షణాలను నిర్మూలించి, అది మరోసారి రాకుండా చేసి అల్సర్ తాలూకు ఏ బాధా లేకుండా చేస్తుంది. ఆ త రువాత మీ ఆహారాన్ని మీరు ఆస్వాదించవచ్చు.
మీ ఆనందాన్ని మీరు పొందవచ్చు. మీ జీవితాన్ని దివ్యంగా జీవించవచ్చు.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..
వివరాలకు….
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Website
https://mathrusreeayurveda.com/home/
Facebook :
https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL
https://www.facebook.com/mathrusreeayurveda/
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
Email :