స్త్రీలు ఎదుర్కొనే అత్యంత ఇబ్బందికర సమస్యలో Urinary Disorder అతిమూత్ర వ్యాధి సమస్యలు ప్రధానమైనవి. మూత్ర విసర్జనను నియంత్రించుకోలేకపోవటం, దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్ అవటం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసిరావటం ఇలా..స్త్రీలు ఎదుర్కొనే మూత్ర సమస్యలెన్నో! అయితే వీటిని మౌనంగా భరించే బదులు వైద్యుల సహాయంతో మూల కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి.
Urinary Disorder అతిమూత్ర వ్యాధి
పదే పదే ‘అదే ఇబ్బంది’
మూత్రాశయ సమస్యలు పుట్టిన పసికందు మొదలుకుని వృద్ధుల వరకూ ఏ వయసులోనైనా రావొచ్చు. అయితే కారణాన్ని బట్టి ఆ సమస్యల లక్షణాలు మారుతూ ఉంటాయి. స్త్రీలకు సంబంధించిన మూత్రాశయ సమస్యల్లో ప్రధానమైనవి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్, యూరినరీ ఇన్‌కాంటినెన్స్. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌కు వయసుతో సంబంధం లేదు. మూత్రం లేకేజీ, మూత్రం ఆపుకోలేకపోవటంలాంటి యూరిన్ ఇన్‌కాంటినెన్స్ 40 ఏళ్లు దాటిన ప్రతి వంద మంది స్త్రీలల్లో 50 మందికి ఉంటుంది.
Urinary Disorder అతిమూత్ర వ్యాధి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (యుటిఐ)
మహిళల్లో మూత్ర సంబంధ ఇన్‌ఫెక్షన్లు రావటానికి ప్రధాన కారణం వారి శరీర నిర్మాణమే! మూత్ర ద్వారం, జననావయవం, మల ద్వారాల మధ్య దూరం తక్కువగా ఉండటం మూలంగా వీటి మధ్య బ్యాక్టీరియా తేలికగా ప్రసరించే వీలుంటుంది. సాధారణంగా బహిరంగ మూత్రశాలల్లో మూత్ర విసర్జన చేయటం వల్లే ఇన్‌ఫెక్షన్ వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ కొంత వరకే ఇది నిజం. ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా మన శరీరంలోనే ఉంటుంది.
శుభ్రత పాటించకపోవటం, శుభ్రం చేసుకునే తీరు మీద అవగాహన లేకపోవటం వల్ల యుటిఐ పదే పదే తలెత్తుతూ బాధిస్తూ ఉంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్ తలెత్తినప్పుడు అందరిలో ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తాయి. మూత్రవిసర్జన సమయంలో మంట, మూత్ర విసర్జన పూర్తిగా అవకపోవటం, చలి జ్వరం ప్రధాన లక్షణాలు. యటిఐకి కారణాలు వయసును బట్టి కూడా మారుతూ ఉంటాయి. కారణాలను పరిగణలోకి తీసుకోవటంతోపాటు యూరిన్ కల్చర్, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా మూలాన్ని గుర్తించి చికిత్సను అందించాలి.
పసి పిల్లల్లో:
కొందరు పసిపిల్లల్లో ‘వెసైకోయురేటరల్ రిఫ్లక్స్’ అనే సమస్య పుట్టుకతోనే ఉంటుంది. అంటే మూత్ర విసర్జన జరిగినప్పుడు మూత్రం మొత్తం కిందకి రాకుండా కొంత మూత్రం తిరిగి మూత్రపిండాల్లోకి వెళ్లిపోతుంది. మూత్ర పిండాల నుంచి మూత్రాన్ని మూత్రాశయానికి చేరవేసే నాళం బలహీనంగా ఉంటే ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటప్పుడు ఈ సమస్యను ఎక్స్‌రేలతో గుర్తించి సర్జరీతో సరిచేయాల్సి ఉంటుంది.
బడి ఈడు పిల్లల్లో:
మల విసర్జన చేశాక శుభ్రం చేసుకునే పద్ధతి మీద పిల్లలకు అవగాహన కల్పించాలి. చేతిని వెనక నుంచి ముందుకు జరిపి శుభ్రం చేసుకోవటం వల్ల మలద్వారం గుండా బ్యాక్టీరియా మూత్రద్వారంలోకి ప్రసరిస్తుంది. కాబట్టి చేతిని ముందు నుంచి వెనక్కు కదుపుతూ శుభ్రం చేసుకునేలా పిల్లలకు నేర్పించాలి.
యుక్త వయస్కుల్లో:
రుతుక్రమం సమయంలో తగినంత శుభ్రత పాటించకపోవటం వల్ల యుక్త వయస్కుల్లో ఈ సమస్య తలెత్తుతుంది. కొత్తగా పెళ్లయిన స్త్రీలను వేధించే ‘హనీమూన్ సిస్టయిటిస్’ కూడా యూరినరీ ఇన్‌ఫెక్షన్ కోవకు చెందినదే!
సెక్స్ తర్వాత ఎక్కువ నీళ్లతో శుభ్రం చేసుకోకపోవటం, మూత్ర విసర్జన చేయకపోవటం వల్ల యుటిఐ బాధిస్తూ ఉంటుంది. యుక్త వయస్కుల్లో ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే రుతుక్రమం సమయంలో ప్రతి 4 గంటలకు ప్యాడ్ మారుస్తూ ఉండాలి. కొత్తగా పెళ్లయిన స్త్రీలు సెక్స్ తర్వాత తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి. ఎక్కువ నీళ్లతో కడుక్కోవాలి.
పెద్ద వయస్కుల్లో:
ఈస్ర్టోజెన్ హార్మోన్ తగ్గటం మూలంగా మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల్లో యూరినరీ పాసేజ్ లైనింగ్ సున్నితంగా తయారవుతుంది. ఈ లైనింగ్ ఎక్కువ సెన్సిటివ్‌గా తయారవటం మూలంగా తేలికగా ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంది. కొంతమంది స్త్రీలలో మూత్రనాళం ఇరుకుగా తయారవుతుంది. దీన్నే స్టినోసిస్ అంటారు. ఇలాంటి పరిస్థితిలో మూత్ర విసర్జన పూర్తిగా జరగక మూత్రాశయంలో కొంత నిల్వ ఉండిపోవటం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోయి యుటిఐ వస్తుంది.
చికిత్స :
ఎక్కువశాతం మందిలో యుటిఐ మందుల వల్ల తగ్గిపోతుంది. కానీ కొందరిలో తగ్గినట్టే తగ్గి మళ్లీ తలెత్తుతూ ఉంటుంది. దీన్నే రికరెంట్ యుటిఐ అంటారు. ఇందుకు మొదట వచ్చిన ఇన్‌ఫెక్షన్ తగ్గకపోవటం లేదా అది తగ్గిపోయి మరో కొత్త ఇన్‌ఫెక్షన్ రావటం కారణం కావొచ్చు. లేదా మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవకుండా మూత్రం దాన్లో నిల్వ ఉండిపోవటం, మూత్రపిండాల్లో లేదా యురెత్రాలో రాళ్లు ఉండటంవల్ల కూడా యుటిఐ తగ్గకుండా పదే పదే వేధిస్తూ ఉంటుంది. కాబట్టి అసలు కారణాన్ని కనిపెట్టి తగిన చికిత్సనందిస్తే రికరెంట్ యుటిఐని కూడా సమూలంగా నియంత్రించవచ్చు.
యుటిఐని Urinary Disorder అతిమూత్ర వ్యాధి అరికట్టాలంటే?
– ఎక్కువ నీళ్లు తాగి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉండాలి అనే అపోహను వదిలివేసి అవసరానికి తగినంత మాత్రమే నీటిని తాగాలి.
– మూత్ర విసర్జన చేయాలనిపించినప్పుడు బలవంతంగా ఆపుకోకూడదు. ఆపుకోవటం వల్ల మూత్రాశయంలోని బ్యాక్టీరియా రెట్టింపై యుటిఐకి దారితీస్తుంది.
– చేతిని వెనకి నుంచి ముందుకు కాకుండా ముందు నుంచి వెనక్కి జరుపుతూ శుభ్రం చేసుకోవాలి.
– సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయాలి.
-వెంటనే మూత్ర విసర్జన చేస్తూ ఉండాలి.
మూత్రం మీద అదుపు కోల్పోవటం
(యూరినరీ ఇన్‌కాంటినెన్స్)
అవగాహన లేమి, నిర్లక్ష్యం, భయం, బిడియం…ఈ కారణాల వల్ల ఈ సమస్యతో బాధపడే స్త్రీలలో కేవలం 10 శాతం మంది మాత్రమే వైద్యుల్ని కలుస్తూ ఉంటారు. యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. సాధారణంగా కనిపించే సమస్య…‘స్ర్టెస్ ఇన్‌కాంటినెన్స్’.
దగ్గాలన్నా, తుమ్మాలన్నా భయం
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, బరువులెత్తినప్పుడు, పరిగెత్తినప్పుడు…మూత్రం చుక్కలుగా కారడాన్ని ‘స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్’ అంటారు. క్లిష్టమైన ప్రసవాలు…అంటే నార్మల్ డెలివరీ, ఫోర్‌సెప్స్ డెలివరీ (ఫోర్‌సెప్స్ సహాయంతో బిడ్డను బయటికి లాగటం), ప్రొలాంగ్‌డ్ లేబర్ (ఎక్కువ సమయంపాటు ప్రసవ వేదన పడటం), ఎక్కువ ప్రసవాలు, తక్కువ గ్యాప్‌లో వరుసగా పిల్లల్ని కన్న వారిలో, సిజేరియన్ చేయించుకున్న వారిలో ఈ సమస్య కనిపిస్తుంది.
మూత్రాశయాన్ని, మూత్ర మార్గాన్ని సపోర్ట్ చేసే కటి కండరాలు ప్రసవం తర్వాత బలహీనపడటమే స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్‌కు ప్రధాన కారణం. అయితే ఈ లక్షణాలు ప్రసవం అయిన వెంటనే కనిపించకపోవచ్చు. 45 ఏళ్లు దాటాక మెనోపాజ్‌కు చేరుకున్నప్పుడు మాత్రమే యూరినరీ ఇన్‌కాంటినెన్స్ బహిర్గతమవుతుంది. ఇందుకు కారణం ప్రసవ సమయంలో బలహీనపడిన కండరాలకు మెనోపాజ్ తోడవటమే!
ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి స్త్రీ ప్రసవం తర్వాత సాగిన పెల్విక్ మజిల్స్‌ను బలపరిచే పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి.
స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ నివారణకు మందులు లేవు, దీన్ని నివారించటానికి సర్జరీ ఒక్కటే పరిష్కారం అనేది కేవలం అపోహ మాత్రమే. హెర్నియాలో మెష్ ఉపయోగించిన విధంగానే ఈ సర్జరీలో మిడ్ యురేత్రల్ స్లింగ్ అనే సింథటిక్ మెష్‌ను ఉపయోగించి యురేత్రాను సపోర్ట్ చేస్తారు.
అయితే ఈ సర్జరీ ఇక పిల్లలు పుట్టరు అనుకున్న స్త్రీలకు చేస్తారు. పిల్లలు పుట్టని స్త్రీలకు చేయొచ్చు.
కానీ తర్వాతి ప్రెగ్నెన్సీకి సర్జరీ ఫెయిల్ అవ్వొచ్చు. అప్పుడు రెండోసారి సర్జరీ అవసరమవుతుంది. కాబట్టి పిల్లలు చాలు అనుకున్న స్త్రీలకే ఈ సర్జరీని వైద్యులు సూచిస్తూ ఉంటారు. సర్జరీ అవసరం లేకుండా మందులతో కూడా దీన్ని తగ్గించవచ్చు. సర్జరీ అనేది శాశ్వత పరిష్కారం ఎంత మాత్రమూ కాదు.

మూత్ర విసర్జన ఆపలేకపోవటం
మూత్ర విసర్జన చేయాలి అనిపించిన తర్వాత ఆగలేకపోయే సమస్య…‘అర్జ్ ఇన్‌కాంటినెన్స్’. ఓవర్ యాక్టివ్ బ్లాడర్…అంటే ఎక్కువసార్లు పగలు లేదా రాత్రి వేళల్లో మూత్ర విసర్జన చేయవలసిరావటంలాంటి వేరే లక్షణాలు కూడా అర్జ్ ఇన్‌కాంటినెన్స్‌లో భాగంగా ఉంటూ ఉంటాయి.
రాత్రివేళ ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసివచ్చే సమస్యను ‘నాక్టోరియా’ అంటారు.
కొంతమందికి ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, నాక్టోరియా…అన్నీ కలిసి కూడా ఉండొచ్చు. ఈ సమస్యను ‘అర్జ్ ఇనకాంటినెన్స్ విత్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్’ అంటారు. ఈ సమస్యకు ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రాశయంలో ట్యూమర్లు ఉండటం, పక్షవాతం, మల్టిపుల్ స్క్లిరోసిస్, వెన్ను సంబంధ ప్రమాదాలు, ఫ్రాక్చర్లు ప్రధాన కారణాలు.
ఇలా మూల కారణాన్ని గుర్తించి వాటికి చికిత్సనందించటం ద్వారా సమస్యను సమూలంగా నివారించవచ్చు.
ఇలాంటి ఏ విధమైన రుగ్మత లేకుండా కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉండొచ్చు. దాన్ని ‘ఈడియొపతిక్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ’ అంటారు. ఈ సమస్యలో లక్షణాలు కనిపించినా వాటికి అంతర్లీన రుగ్మత కారణం అయి ఉండదు. అలాంటప్పుడు నేరుగా ఈ సమస్య నివారణకే వైద్యులు మందులు సూచిస్తారు.
కొంతమందికి స్ట్రెస్ , అర్జ్ రెండూ కలిసి ఉండే మిక్స్‌డ్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్లకి ‘యూరో డైనమిక్ స్టడీ’ అనే పరీక్ష ద్వారా మూత్రాశయం పనితీరును గమనించి కాంటినెన్స్‌కు అసలు కారణాన్ని కనిపెట్టి తదనుగుణ చికిత్సను చేయాలి.
మూత్రంలో రక్తం కనిపిస్తే?
మూత్రంలో రక్తం కనిపిస్తే దానికి క్యాన్సరే కారణమని భయపడిపోవటం లేదా లక్షణాన్ని తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేయటం…రెండూ సరికాదు. ఇన్‌ఫెక్షన్లు, రాళ్లు, క్యాన్సర్, కిడ్నీ ఇన్‌ఫ్లమేషన్…ఇలా మూత్రంలో రక్తం కనిపించటానికి పలు కారణాలుంటాయి.
కాబట్టి డయాగ్నసిస్ ద్వారా అసలు కారణాన్ని కనిపెట్టి చికిత్సనందించాలి.
ఇందుకోసం మొదట కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ చేసి ఇన్‌ఫెక్షన్ వివరం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్ ఉంటే మందులిస్తే సరిపోతుంది. లేదంటే అల్ట్రాసౌండ్ పరీక్ష చేయవలసి ఉంటుంది.
దీని వల్ల మూత్రపిండాలు, మూత్రాశయాల ఆరోగ్యం, వాటి పనితీరు, వాటిలో ఉన్న ట్యూమర్లు, రాళ్లులాంటి విషయాలు తెలుస్తాయి. ఆ ఫలితాన్నిబట్టి తదనుగుణ చికిత్స చేస్తే మూత్రంలో రక్తం కనిపించటం ఆగిపోతుంది.
మూత్రం మసకగా కనిపిస్తే?
మూత్రం నీళ్లలా కాకుండా మసకగా ఉంటే కనపడనంత పరిమాణంలో రక్తం లేదా ప్రొటీన్లు, చీము కణాలు పోతున్నాయని అర్థం.
హైపర్‌టెన్షన్, రక్తపోటు అదుపులో లేని వాళ్లలో ఈ లక్షణం కనిపిస్తుంది.
సాధారణంగా మాంసకృతుల్ని మూత్రపిండాలు ఫిల్టర్ చేయాలి. కానీ ఈ రోగుల మూత్రపిండాల్లోని నెఫ్రాన్స్ డ్యామేజ్ అవటంమూలంగా ప్రొటీన్స్ మూత్రంతోపాటు ఫిల్టరైపోతూ ఉంటాయి.
మధుమేహుల్లో కీటోన్ బాడీస్ మూత్రంలో పోతుండటం వల్ల మూత్రం దుర్వాసన కలిగి ఉంటుంది.
గర్భిణుల్లో మూత్ర సమస్యలు
మిగిలిన స్త్రీలలో గర్భిణులకు కూడా యూరనరీ ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. అయితే గర్భిణులకు ఇన్‌ఫెక్షన్ వల్ల సమస్యల రెట్టింపవుతాయి. తీవ్రంగా కొన్నిసార్లు ప్రమాదకరంగా పరిణమిస్తాయి..
ఇన్‌ఫెక్షన్ వల్ల అబార్షన్ జరగటం, నెలలు నిండకుండా ప్రసవం జరగటం, ఉమ్మనీరు కారిపోయి నెలలు నిండకుండానే ప్రసవం చేయవలసిరావటంలాంటి సమస్యలు గర్భిణుల్లో తలెత్తవచ్చు.
గర్భిణులు యూరినరీ ఇన్‌ఫెక్షన్‌కు గురయినప్పుడు ‘హైడ్రోనెఫ్రోసిస్’ అనే మూత్రపిండాల వాపు వస్తుంది.
గర్భాశయ పరిమాణం పెరిగేకొద్దీ మూత్రపిండాలు మూత్రాశయాన్ని కలిపే నాళం నొక్కుకుపోతుంది. దాంతో మూత్రపిండంలో మూత్రం నిల్వ ఉండిపోతుంది. ఈ పరిస్థితినే ‘ప్రెగ్నెన్సీ ఇండ్యూసడ్ హైడ్రోనెఫ్రోసిస్’ అంటారు.
ఈ పరిస్థితి ఎక్కువశాతం గర్భిణులకు ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బంది కలిగించకుండానే ఉండిపోతుంది. కొందరిలో బ్లాడర్ ఇన్‌ఫెక్షన్ మూత్రపిండాలకు పాకి ‘అక్యూట్‌పైలోనెఫ్రోటిస్’కు దారితీస్తుంది.
అప్పుడు విపరీతమైన చలి జ్వరం, నడుం నొప్పి, వాంతులు లక్షణాలు కనిపిస్తాయి.
ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్ అక్కడితో ఆగకుండా రక్తంలోకి ప్రసరించి ‘సెప్టిసీమియా’ అనే ప్రాణాంతక రుగ్మతకు కూడా దారితీస్తుంది.
ఇలాంటప్పుడు ఇన్‌ఫెక్షన్‌ను అదుపు చేయటం కోసం ఎండోస్కోపీ ద్వారా మూత్రపిండాల్లో ‘స్టెంట్’ వేయాల్సి రావొచ్చు.
కొందరు గర్భిణుల్లో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. వీటిని సాధ్యమైనంతవరకూ మందులతోనే కరిగించే ప్రయత్నం చేయవచ్చు.
ఒక్కోసారి రాయి మూత్రనాళంలో ఇరుక్కుపోయినప్పుడు ఎండోస్కోపీ ద్వారా ఆ రాయిని తొలగించి స్టెంట్ వేస్తారు.
ఒకవేళ రాయి పరిమాణం మరీ పెద్దదిగా ఉంటే రాయిని అలాగే ఉంచి అప్పటికి స్టెంట్ వేసి ప్రసవమైన తర్వాత రాయిని తొలగిస్తారు.
ఇలా రాయి ప్రదేశం, పరిమాణం, స్థానాన్ని బట్టి గర్భిణులకు చికిత్స చేస్తారు.
మధుమేహుల్లో..
మధుమేహుల్లో మూత్రం ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. రక్తంలో పెరిగిన గ్లూకోజ్‌ను మూత్ర పిండాలు వడకట్టడమే ఇందుకు కారణం.
ఇలా గ్లూకోజ్‌ను మూత్రపిండాలు ఫిల్టర్ చేయటానికి నీరు ఎక్కువగా అవసరమవుతుంది.
ఫలితంగా శరీరంలోని నీరు కూడా గ్లూకోజ్‌తోపాటు ఫిల్టరై మూత్రం రూపంలో బయటకు వస్తుంటుంది. ఇలా ఎక్కువగా మూత్ర విసర్జన చేసే లక్షణాన్ని ‘పాలీ యూరియా’ అంటారు.
ఈ లక్షణాన్ని బట్టి మధుమేహం ఉందని తేలికగా కనిపెట్టేయవచ్చు.
వీరిలో యూరిన్ ఇన్‌ఫెక్షన్లు కూడా ఎక్కువే! ఇన్‌ఫెక్షన్లు పదే పదే రావటం వల్ల మూత్రాశయం ఇరిటేట్ అయిపోతుంది. ఫలితంగా కొద్ది మూత్రం నిండుకోగానే మూత్రాశయం దాన్ని బయటకు తోసేయటానికి ప్రయత్నం చేస్తుంది.
దాంతో ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. డయాబెటిక్ ఇన్‌స్పిడస్ రోగుల్లో కూడా పాలీ యూరియా లక్షణాలు కనిపిస్తాయి.
వీళ్ల శరీరంలో నీటి విసర్జనను నియంత్రించే ‘యాంటీ డయూరిటిక్ హార్మోన్’ తగ్గటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను అదుపు చేయటం అవసరం.
ఈ లక్షణాలుంటే వైద్యుల్ని కలవండి
– మూత్రంలో మంట – మూత్రంలో రక్తం పోవటం.
– చలి జ్వరం, నడుం నొప్పి, వాంతులు.
– మూత్రం దుర్వాసన
– ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసిరావటం.
– మరిముఖ్యంగా రాత్రివేళ ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయవలసిరావటం.
– మూత్రాన్ని అదుపుచేసుకోలేకపోవటం.
– మూత్రం చుక్కలుగా పడటం.
– మూత్ర విసర్జనలో ఇబ్బంది. బలంగా మూత్రవిసర్జన చేయవలసిరావటం.
– విసర్జన తర్వాత కూడా ఇంకా మూత్రం మిగిలి ఉందని అనిపించటం.
ఆయుర్వేద చికిత్స:
మూత్రాశయ వ్యాధులన్నింటినీ కేవలం ఒౌషధాలతో శాశ్వతంగా నివారించవచ్చు. ఆపరేషన్ అవసరం లేనేలేదు. ఒౌషధాలతో నివారించడం వలన ఈ సమస్యలు పదే పదే తిరిగి రావు.
శాశ్వత పరిష్కారం ఆయుర్వేదంతో పూర్తిగా సాధ్యమవుతుంది.
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Website
https://mathrusreeayurveda.com/home/
Facebook :
https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL
https://www.facebook.com/mathrusreeayurveda/
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
Email :
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.
Your article helped me a lot, is there any more related content? Thanks!
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good. https://accounts.binance.com/ph/register?ref=B4EPR6J0
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.