Drinking water త్రాగునీటి లక్షణం ఏ విధంగా ఉండాలి అలాగే ఎటువంటి పద్ధతులను పాటించాలి అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. నీటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని అభిప్రాయం విశేష స్థాయిలో ఉంది. అనేక రకాలైన వైద్య విధానాలలో త్రాగునీటి పద్ధతులకు విశేషమైన ప్రచారం లభిస్తుంది. నీరు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి. అతిగా నీటిని త్రాగటం హానికరమైన సంగతి చాలామంది గుర్తించ లేకపోతున్నారు. దీనికి అనేక కారణాలు.
Drinking Water త్రాగునీటి లక్షణం
పారుచూ శుభ్రముగా తేలికగా వుండి ఎండ, గాలి తగులుచూ వున్న నీళ్ళు శ్రేష్టమయినవి.
భోజనం చేసే సమయంలో:
భోజన కాలమందు మధ్య మధ్య అవసరానికి తగినట్లు కొద్ది కొద్దిగా నీటిని తీసుకోవడం వలన వాత పిత్త శ్లేష్మములను సమానస్థితిలో ఉంచును.
సప్త ధాతువులకు సౌమ్యతను, సౌఖ్యమును, జఠరదీప్తిని కలుగచేయును. ఆహారమును తేలికగా జీర్ణము చేయును.
ఆహారం తీసుకునే సమయంలో అతిగా నీటిని త్రాగినా, తగినంత త్రాగకపోయినా ఆహారము సరిగా జీర్ణం అవటం లో సమస్య ఏర్పడును.
భోజనానంతరం అధికంగా నీటిని తీసుకుంటే కఫము పెరిగే అవకాశం కలదు. జీర్ణవ్యవస్థలో లోపాలు ఏర్పడి ఆహారం ద్వారా లభించవలసిన శక్తిని శరీరం పూర్తిగా గ్రహించదు.
అలాగే, బాగా ఆకలిగా ఉన్నప్పుడు మంచినీరు త్రాగడం, మంచినీటితో కడుపు నింపడం లాంటి పనులు పైల్స్, ఫిస్టులా, ఫిషర్ లాంటి వ్యాధులకు కారణం అవుతుంది.
ఫ్రీ మోషన్ ( సుఖ విరోచనం) :
ఫ్రీ మోషన్ ( సుఖ విరోచనం) అవుతుందనే కారణంతో కొద్ది మంది పరగడుపున వేడి నీరు, లేదా నీరు కాస్తంత ఎక్కువగా త్రాగడం జరుగుతోంది. ఫ్రీ మోషన్ లేదా సుఖ విరేచనం కావాలంటే అందుకు తగిన ఔషధాలను తీసుకోవాలి. అంతేకానీ పనిగట్టుకుని నీటిని అధికంగా తాగడం సరైనది కాదు.
ఈ విధంగా చేయడం వలన జీర్ణశక్తి లోపించడంతోపాటు కాలేయము యొక్క పనితీరు మందగిస్తుంది. అంతేకాకుండా మతిమరుపు వచ్చే అవకాశం కలదు.
అతిమూత్ర వ్యాధి:
సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్ళవలసి రావడం, మూత్రాన్ని కొద్దిసేపు కూడా ఆపుకోలేకపోవడం, దగ్గినా తుమ్మినా మన ప్రమేయం లేకుండా మూత్రం చుక్కలు చుక్కలుగా లేదా కొద్ది పరిమాణంలో బయటకు రావడం ఇటువంటి లక్షణాలను అతిమూత్ర వ్యాధి అనవచ్చు.
అతిగా పనిగట్టుకుని నీళ్లు తాగడం వలన అతిమూత్ర వ్యాధి తప్పకుండా వచ్చి తీరుతుంది.
బాగా దాహం అయినప్పుడు ఒకేసారి అధికంగా తాగకుండా కనీసం రెండు మూడు సార్లుగా త్రాగడం శ్రేష్టం.
ఈ సందర్భాలలో…
చలువ చేసే ఫలములు, నీరు కలిగిన ఫలములు అనగా నారింజపండు, కమలాఫలం, బత్తాయి, పంపర పనస, పుచ్చకాయ, అరటి పండ్లు, నేరేడు పండ్లు, దోస లేదా కీర దోస, పైనాపిల్, కర్బూజా, మామిడి పండ్లు మొదలగు పండ్లు లేదా ఫలములను అలాగే, మిఠాయి మొదలగు తీపి పదార్థాలను, బెల్లము వరి పిండితో చేయబడిన పిండి వంటలను, చేపలను తినిన వెంటనే, పాలు త్రాగిన వెంటనే, తాంబూలం వేసిన వెంటనే నీటిని త్రాగడం వలన జీర్ణ రసములు మలినమై వాతవ్యాధులకు కారణం అగును. ఇది అనేక వ్యాధులు ఏర్పడడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.
దాహము కాకున్నప్పుడు, మిక్కిలి దూరం నడచి వచ్చిన తక్షణం, బాగా శ్రమ చేసిన వెంటనే, నిద్రపోయి లేచిన తక్షణం, స్నానం, సంభోగ తక్షణం, నిద్రాకాల మధ్యమునందు, పరగడుపున, పడుకుని మరియు నిల్చోని నీళ్ళు త్రాగడం అనేక రోగములు కలుగుటకు కారణం అగును.
నీటి పాత్ర లక్షణం:
నీటిని ఉంచుటకు మట్టి కుండ అత్యంత శ్రేష్టం. కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా ఆ కుండను మార్చడం తప్పనిసరి. సహజమైన చల్లని నీరు ఆరోగ్యకరం.
రిఫ్రిజిరేటర్ లోని విపరీతమైన చల్లని నీరు, వడగండ్ల ద్వారా లభించిన నీరు అనేక రోగాలకు కారణం అగును.
వేడి నీటిలో చల్లని నీటిని కలిపి త్రాగడం నిషిద్ధం.
నీటి శుభ్రత:
నీటిని శుభ్రపరచుటకు , నిల్వ ఉంచుటకు కెమికల్స్ ఉపయోగించడం ద్వారా తయారైనటువంటి మంచినీరు గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్ మొదలగు వ్యాధులకు కారణం అవుతుంది.
కాచి వడపోసి, సాధారణంగా చల్లారిన నీరు శ్రేష్టం.
ఏ విధమైన కెమికల్స్ ఉపయోగించబడినటువంటి వాటర్ ఫిల్టర్స్ వాడకం చాలా మంచిది.
ఎండాకాలం, ఏదైనా వ్యాధి పీడితులైవున్నపుడు అవసరానికి తగినట్లు చెసే అధిక ఉదకపానం దోషమాపాదించదు.
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Website
https://mathrusreeayurveda.com/home/
Facebook :
https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL
https://www.facebook.com/mathrusreeayurveda/
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
Email :