Salt Uses ఉప్పు ప్రయోజనాలు

Social Share
Salt Uses ఉప్పు ప్రయోజనాలు
Salt

Salt Uses ఉప్పు ప్రయోజనాలు

ఈ మధ్య కాలంలో ఉప్పు వాడకం మంచిది కాదు అనే ప్రచారం బాగా జరుగుతోంది. ఉప్పు వాడడం వల్ల అధిక రక్తపోటు వస్తుందని, హృద్రోగానికి ఉప్పు కారణమని దీనిని వాడడం పూర్తిగా మానివేయాలని లేదా వాడుక బాగా తగ్గించాలని,లేకుంటే అనేక రకాల వ్యాధి పీడితులౌతారని విచిత్ర ప్రచారం జరుగుతోంది.

ఆయుర్వేదం, సిద్ధ, అల్లోపతి, హోమియోపతి వైద్య విధానాలలో ఉప్పు అత్యంత ఉపయోగకర పదార్ధం. ఆయుర్వేద వైద్య శాస్త్రం 72 రకాల ఉప్పులను గుర్తించింది. ముఖ్యంగా ఎముకల, నరాల, కండరాల, కడుపు నొప్పులను తగ్గించుటలో ఉప్పును అన్ని ప్రధానమైన వైద్య విధానాలలో ఉపయోగించుట జరుగుతోంది.

హోమియోపతి వైద్య విధానంలో ద్వాదశ లవణాలు (12 రకాల ఉప్పులు ) ఉపయోగించుట ద్వారా అనేక రకాలయిన వ్యాధులను నివారించవచ్చు అనే ద్వాదశ లవణ సిద్ధాంతం కలదు.

సిద్ధ అనబడే వైద్య విధానంలో ఉప్పును విశేషంగా వాడుట జరుగుతోంది.లవణ భస్మం, లవణ సింధూరంలను చేయుదురు.అన్ని రకాల వ్యాధులలో సహాయకారిగా వాడదగినది.

ఆయుర్వేదంలో

ఆయుర్వేదంలో కూడా ఉప్పు అత్యంత ఉపయోగకారి.ఎముకల నొప్పులకు మరియు ఎముకల పుష్టికి విశేషంగా వాడదగినది.జీర్ణ వ్యాధులందే కాక నరములకు శక్తినిచ్చు పదార్ధంగా వాడుదురు. ఎముకల బలహీనతకు, నరముల నిస్త్రాణతకు ఉప్పు బహు ఉపయోగకారి అని ఆయుర్వేదం తెలుపుతోంది.

మనం రోజూ తీసుకునే ఆహారంలోని అన్ని పదార్ధముల కంటే ఎక్కువ బలమిచ్చునది ఉప్పు. వీర్య పుష్టిని, జఠర దీప్తినిచ్చును. మనము తిన్న ఆహారము చక్కగా జీర్ణముగావించి కడుపునొప్పి, కడుపుబ్బరం, త్రేనుపులు, అల్సర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, మొదలగు వ్యాధులను నివారించి అరుచి అను వ్యాధిని పోగొట్టును. కఫము, వాతము, శ్వాస కాసలను పోగొట్టును.వాంతులలో రక్తము పడెడి వ్యాధిని నివారించును.గుండె నొప్పిని తగ్గించగలదు. వాత శ్లేష్మములను హరించి శరీరమందు వేడిని నిలుపును.నీరసము మరియు నిస్సత్తువలను అతి త్వరగా తగ్గించును.

మన శరీరమునందలి రక్తములో ఉప్పు కలదు.శరీరమందలి ధాతుపోషణకు కావలసినంత ఉప్పు ఆయా ధాతువులకు సరఫరా అవ్వగా మిగిలినది మల మూత్ర రూపమున బయటకు వెడలిపోవును. ఉప్పు తగినంత సరఫరా కానిచో ఆమ్ల రసము పక్వముకాక రసరూపమునే మూత్రము ద్వారా వెడలి అతిమూత్ర వ్యాధికి కారకమగును.శరీరములో ఉప్పు తగినంత పరిమాణములో లేనప్పుడు జీర్ణశక్తి లోపించి అజీర్ణ విరేచనములగును. శ్లేష్మమును కరిగించి వాయు ప్రసారమునకు మార్గమునేర్పరచును. కనుక ఊపిరితిత్తులను శుభ్ర పరచుటలో ఉప్పు ఉపయోగకారి.

ఉప్పు ప్రయోజనాలు

1. తేలు కుట్టిన వెంటనే ఉప్పు కలిపిన నీటిని కండ్లలో వేసిన తేలు విషము విరుగును.

2.రక్త మాంస వికారములచే జనించు చర్మ వ్యాధులందు బాగా ఉపయోగము.

3. రక్త ప్రసరణ బాగా జరుగుటకు ఉప్పు ఉపయోగకర ద్రవ్యము.

4. లో బ్లడ్ ప్రెషర్లో ఉప్పు అత్యద్భుతంగా పనిచేయును.

5. కాళ్ళు చేతుల తిమ్మెర్లు కలుగుటను నయంచేయును.

6. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి మలేరియా వ్యాధి గ్రస్తులకు ఇచ్చిన త్వరగా తగ్గును.( ఒక చెంచాడు మాత్రమే, రోజుకు నాలుగు సార్లు )

7.  అప్పుడప్పుడు సముద్ర స్నానం చేయుట మంచిది.

8. ఉప్పు ద్రవం కళ్ళలో వేయుట వల్ల కండ్ల కలకలు వ్యాధి నివారణ అగును.

9. కొండ నాలుకకు ఉప్పు రాయడం వల్ల కోరింత దగ్గు తగ్గును.

10. ఉప్పు చప్పరించుట వల్ల కండ్ల మంటలు తగ్గును.

# కట్టిన ఉప్పు హై బ్లడ్ ప్రెషర్ వ్యాధిని నిశ్శేషంగా నయం చెయ్యగలదు. (కట్టుట అనునది ఆయుర్వేదం మరియు సిధ్ధ వైద్య విధానాలలో ఒక శాస్త్రీయ వైద్య ప్రక్రియ )

శరీరంలో ఉప్పు సరిగా జీర్ణము కానప్పుడు అజీర్ణ వ్యాధులైన కడుపుబ్బరం, కడుపు నొప్పి, అల్సర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ మరియు నరముల, ఎముకల వ్యాధులు కలుగును.
అలాంటి పరిస్ధితులలో ఉప్పు జీర్ణం అవ్వడానికి కావలసిన అనువైన మార్గాలను ఆయుర్వేద విధానాల ద్వారా మాత్రమే పొందుటకు సాధ్యము.

సైంధా లవణం (rock salt), బిడా లవణం (black salt)
ఈ రెండిటిలో ఏది మంచిదనే సందేహం చాలా మందిలో ఉంది.

వీటిలో పదార్థాల రుచిని దృష్టిలో ఉంచుకొని కొన్ని పదార్థాలలో బ్లాక్ సాల్ట్ ని అతి స్వల్ప మోతాదులో ఉపయోగించడం జరుగుతోంది. ఉపయోగించవచ్చు.

రాక్ సాల్ట్ ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగించే పదార్థం మాత్రమే. అంతేతప్ప సాధారణ భోజన పదార్థాలలో ఉపయోగించ తగినది కాదు. ఇది సాధారణ భోజన పదార్థాలలో ఉపయోగించటం వల్ల ఎటువంటి ప్రమాదం జరగదు అలాగే ప్రత్యేక ప్రయోజనం కూడా ఏమీ లేదు.

కొత్తొక వింతపాతొక రోత… ఈ సామెత ఈ విషయంలో సరిగ్గా సరిపోతుంది.

రోజువారి తీసుకునే భోజన పదార్థాలలో సముద్ర లవణం అత్యంత శ్రేష్టమైనది.

గమనిక: ఉప్పును అధికంగా వాడటం ఎవరికీ సాధ్యం కాదు. ఉప్పు నిల్వలు శరీరంలో అధికం అయితే వాంతి లేదా విరేచన రూపంలో బయటకు వెళ్ళిపోతుంది.

#*# శరీరంలో సోడియమ్ లెవల్స్ పడిపోయినప్పుడు ఉప్పు ఎంత బలవర్ధక పదార్ధమో బాగా తెలిసొస్తుంది.

వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..

Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700

Website
https://mathrusreeayurveda.com/home/

Facebook :

https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL

https://www.facebook.com/mathrusreeayurveda/

https://m.facebook.com/doctorayurvedaandsiddha

https://m.facebook.com/ayurvedaandsiddha

Youtube:

https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg

Email :

drmahesh@mathrusreeayurveda.com

332 thoughts on “Salt Uses ఉప్పు ప్రయోజనాలు”

  1. I am really impressed with your writing talents as neatly as with the structure for your weblog. Is that this a paid topic or did you customize it your self? Either way stay up the nice high quality writing, it is uncommon to look a nice blog like this one today!

    Reply
  2. В этой информационной статье вы найдете интересное содержание, которое поможет вам расширить свои знания. Мы предлагаем увлекательный подход и уникальные взгляды на обсуждаемые темы, побуждая пользователей к активному мышлению и критическому анализу!
    Подробнее тут – https://medalkoblog.ru/

    Reply

Leave a comment

Open chat
1
మీ పేరు,వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
సాధ్యమయినంత త్వరలో స్పదించగలము.

దయచేసి,పూర్తి వివరాల కొరకు Dr.Mahesh గారిని సంప్రదించగలరు.
cell no: 9701965700 ; 8686622900

సంప్రదించవలసిన వేళలు: 11 Am to 8 PM
సంప్రదించినందులకు ధన్యవాదాలు.