Herpes హెర్పిస్ సుఖ వ్యాధి

Social Share

హెర్పిస్ వ్యాధి…. కారణాలు, లక్షణాలు…
ఆయుర్వేద చికిత్స..

Herpes హెర్పిస్ సుఖ వ్యాధి
Girl lips showing herpes blisters

 

Herpes హెర్పిస్ సుఖ వ్యాధి

అతి సూక్ష్మమైన హెర్పెస్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు :

జననాంగాల వద్ద అసాధారణమైన పుండ్లు, దుర్వాసనతో కూడిన స్రావం, మూత్ర విసర్జన సమయంలో మంట ఉంటాయి. ఈ లక్షణాలు ఏవైనా గమనించినట్లయితే మీరు డాక్టర్‌ని కలవాలి.

లైంగిక కలయిక జరిగిన 4 నుంచి 7 రోజుల తర్వాత జననాంగాల వద్ద చిన్న పొక్కులలా, నీటి బొబ్బలుగా వస్తాయి. తర్వాత పుండ్లు ఏర్పడతాయి. మహిళలు ఆ ప్రదేశంలో నొప్పి, వాపుతో బాధ పడతారు. మూత్ర విసర్జన చాలా బాధాకరంగా మండుతున్నట్లుగా ఉంటుంది.

జననేంద్రియాల హెర్పెస్ (పునరావృత ఇన్ఫెక్షన్ – Recurrent Genital Herpes ) :

మొదటి సారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత , హెర్పెస్ వైరస్ నరాలలో అచేతనంగా కొంత కాలం ఉండిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గినపుడు వైరస్‌లు మళ్లీ ఉత్తేజితమై పునరావృత సంక్రమణ (Recurrent infection) వస్తుంది.

హెర్పిస్‌ సింప్లెక్స్‌ అనే వైరస్‌లో హెచ్‌ఎస్‌వి 1, హెచ్‌ఎస్‌వి 2 అనే రెండు రకాలుంటాయి. హెచ్‌ఎస్‌వి 1 నోటి దగ్గర పెదవుల చుట్టూ తెల్లని నీటి పొక్కుల రూపంలో బయల్పడుతుంది. పిల్లల్లో కనిపించే ఈ వ్యాధి వచ్చి పోతూ ఉంటుంది.

జననావయవాల దగ్గర పొక్కులతో బయల్పడే హెచ్‌ఎస్‌వి 2 జెనైటల్‌ హెర్పిస్‌. కలయిక సమయంలో చర్మం చిట్లినప్పుడు పుండ్లు, గాయాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ వెన్నెముక చివర, శాక్రమ్‌ నాడుల సముదాయంలో తిష్టవేసి నిద్రావస్థలో ఉండిపోతుంది.

రోగనిరోధకశక్తి బలహీనపడినప్పుడు, మానసిక, శారీరక ఒత్తిళ్లు పెరిగినప్పుడు, వాతావరణ పరిస్థితులు మారినప్పుడు లేదా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఈ వ్యాధి సుడిగాలిలా విజృంభిస్తుంది.

లక్షణాలు: తొలిదశలో జననాంగంలో నొప్పి, మంట, ఒళ్లు నొప్పులు, గజ్జల్లో, చంకల్లో గడ్డలు ఏర్పడతాయి. లైంగిక అవయవాలపై చిన్న నీటి పొక్కులు ఏర్పడతాయి. ఇవి మూడు రోజుల్లో పగిలి పుండ్లుగా మారతాయి. కొంతమందిలో తగ్గుతూ, తలెత్తుతూ రికరెంట్‌ ఎటాక్స్‌తో వేధిస్తుంది.

హెర్పిస్‌ రికరెంట్‌ అటాక్స్‌: ఈ రకం ఎటాక్స్‌లో లక్షణాల తీవ్రత తక్కువ. అయితే పుండ్లు పగిలి, మానిపోయినా, వాటి నుంచి వచ్చిన రసిక లైంగిక సంపర్కం ద్వారా ఇతరులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. స్త్రీలలో నెలసరి రక్తస్రావం కారణంగా పొక్కులు ఉన్నా తెలియవు. పైకి కనిపించకపోయినా లోలోపల హెర్పిస్‌ ఉంటుంది.

వైరస్‌లు రీయాక్టివేట్ కావడానికి కారణాలు :

రోగ నిరోధక శక్తి తగ్గినపుడు ఈ వైరస్‌లు పునరుత్తేజితమవుతాయి. జ్వరం వచ్చినా, అల్ట్రా వయొలెట్ కాంతి సోకినపుడు, రుతుస్రావమైనపుడు, ఒత్తిడిలో ఉన్నా, ఏదైనా గాయమైనా ఈ వైరస్ చైతన్యవంతమవుతుంది.

Herpes Virus -2 పునరావృత ఇన్ఫెక్షన్ రాబోయే ముందు, నరాలలో నొప్పి, చర్మం స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు 1- 2 రోజులుంటాయి. ఆ తర్వాత చర్మం మీద నీటిపొక్కులు, పుండ్లు ఏర్పడతాయి.

ప్రాథమిక వ్యాధి (Primary Infection) తో పోలిస్తే ఈ పునరావృత స్థాయిలో లక్షణాలు తక్కువ ఉంటాయి.

వయసు పెరిగే కొద్దీ మళ్లీమళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గిపోతుంది.

తల్లి నుంచి గర్భస్థ శిశువుకు సంక్రమిస్తుందా?

జననేంద్రియాల హెర్పెస్ లైంగిక సంబంధాల వల్ల వ్యాప్తి చెందుతుంది.

కొందరు వ్యక్తులలో ఏ లక్షణాలు లేనప్పటికీ వారిలో వైరస్ ఉండొచ్చు. అలాంటివారు తమ నుంచి లైంగిక భాగస్వాములకు వైరస్‌ను బదిలీ చేయగలరు.

ఇటీవలికాలంలో Herpes Type 1 ఇన్ఫెక్షన్లు ఎక్కువైనట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కౌమారంలో ఉన్నవారిలో వైరస్ ఎక్కువవుతున్నట్లు ఒక అధ్యయనం తెలిపింది.

ఈ వయసువారు ఎక్కువగా ఓరల్ సెక్స్‌లో పాల్గొనడమనేది కారణంగా చెప్పవచ్చు.

తల్లి నుంచి గర్భస్థ శిశువుకి సోకే ప్రమాదముంది. దాని వల్ల అబార్షన్ అయ్యే అవకాశముంది.

అంతేకాకుండా, బిడ్డ , గర్భంలోనే చనిపోవడం, అవయవలోపాలు, శిశువు చర్మం మీద, కంటిలోను కురుపులు రావడం జరగవచ్చు.

హెర్పెస్ ఉన్నవారు సెక్స్లో పాల్గొన వచ్చా? 

హెర్పెస్ ఉంటే, ముందుగా సెక్స్ పార్టనర్‌(ల)తో మాట్లాడాలి. తనకు హెర్పెస్ ఉన్న విషయం, దాని వల్ల కలిగే ప్రమాదం గురించి వారికి తెలియజెప్పాలి.

కండోమ్‌లను ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు, కానీ, అది ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేదు. పుండ్లు లేదా హెర్పెస్ యొక్క ఇతర లక్షణాలను కలిగి ఉండటం వలన వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుంది. మీకు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ, మీరు మీ సెక్స్ భాగస్వాములకు వైరస్‌ సోకేలా చేస్తారు.

గర్భిణులకు హెర్పెస్ సంక్రమిస్తే సిజేరియన్ చేయాల్సిందేనా? 

గర్భిణి మొదటి దశలో హెర్పెస్ ఇన్ఫెక్షన్ సోకినట్లయితే అబార్షన్ జరిగే ప్రమాదం ఉంది.

బిడ్డకు అవయవ లోపాలు, చర్మంపై, కంటిలో కురుపులు సైతం రావచ్చు.

సాధారణ కాన్పు జరిగే సమయంలో, తల్లి గర్భ ద్వారంలో ఉన్న హెర్పెస్ ఇన్ఫెక్షన్ తో కూడిన ద్రవాలు సోకడం వల్ల పుట్టే బిడ్డకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది.

శిశువుకి హెర్పెస్ (Neonatal herpes) వ్యాధి కొన్ని సార్లు చర్మానికి, కళ్లకు, నోటికి మాత్రమే వస్తుంది. ఇటువంటి తేలికపాటి లక్షణాలుంటే , అది పెద్ద ప్రమాదకరం కాదు.

కానీ, శిశువు శరీరంలోని ప్రతి భాగానికీ హెర్పెస్ సంక్రమిస్తే ( Disseminated Herpes) అది ప్రాణాంతకం అవుతుంది. అప్పుడు శిశువు మరణించే ప్రమాదం ఉంది.

యాంటీవైరల్ మందులు వాడినా సరే, మరణించే అవకాశం 30 శాతం వరకూ ఉంటుంది.

ఎక్కువగా, ఈ తీవ్రమైన వ్యాధి నెలలు నిండని (Premature babies) బిడ్డలలో వచ్చే అవకాశం ఉంది.

ప్రాధమిక ఇన్ఫెక్షన్ (Primary Herpes) కాన్పు సమయంలోగానీ, డెలివరీ డేట్ కు 6 వారాల ముందు సంభవించినా గానీ, సాధారణ కాన్పు చేయకూడదు.

గర్భిణి, కాన్పు కోసం వచ్చిన సమయంలో గానీ, లేదా కాన్పు డేట్‌కు 6 వారాల ముందు గానీ హెర్పెస్ వచ్చి వున్నట్లయితే, ఆమెకు సాధారణ కాన్పు చేయడం , శిశువుకి ప్రమాదకరం. జనన మార్గంలో ఉన్న హెర్పెస్ సోకిన ద్రవాలు శిశువుకు తీవ్రమైన వ్యాధిని (Neonatal Herpes) కలుగజేస్తాయి.

అందుకని బిడ్డకు ప్రాణాంతకమైన నియోనాటల్ హెర్పెస్ రాకుండా నివారించేందుకు, సాధారణ కాన్పుకు బదులు సిజేరియన్ ద్వారా డెలివరీ చేయాలి.

తల్లికి ప్రాథమిక ఇన్ఫెక్షన్ ( Primary Herpes) వుంటేనే బిడ్డకు, నియోనేటల్ హెర్పెస్ వచ్చే అవకాశముంది.

అదే , కాన్పు సమయంలో తల్లికి పునరావృత ఇన్ఫెక్షన్ (recurrent infection) వస్తే, బిడ్డకు తీవ్రమైన వ్యాధి (Neonatal Herpes) వచ్చే ప్రమాదముండదు. ఆ పరిస్థితుల్లో, సాధారణ కాన్పు చేయవచ్చు.

తల్లికి పునరావృత ఇన్ఫెక్షన్ (Recurrent Herpes) స్థితిలో వున్నపుడు బిడ్డకు తల్లినుండి యాంటీ బాడిస్ బదిలీ అవుతాయి. ఆ యాంటీబాడిస్ వల్ల బిడ్డకు రక్షణ లభిస్తుంది.

జననేంద్రియ హెర్పెస్ వచ్చే ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చు :

లైంగిక సంక్రమణ వ్యాధులు లేని భాగస్వామితో, దీర్ఘకాలికంగా పరస్పర సంబంధం మాత్రమే (Monogamy) ఉంటే ఈ వైరస్ రాదు. ఇద్దరిలో ఏ ఒక్కరికి వేరేవారితో లైంగిక సంబంధాలున్నా వైరస్ రావడానికి అవకాశం ఉంటుంది.

కండోమ్‌ వాడడం వల్ల కొంత రక్షణ పొందవచ్చు.

సెక్స్ చేసే ప్రతిసారి రబ్బరు కండోమ్‌లను సరైన మార్గంలో ఉపయోగించాలి.

కానీ, రబ్బరు కండోమ్,‌ హెర్పెస్ పుండ్లు ఉన్న అన్ని ప్రదేశాలనూ కప్పలేదు. అంతే కాదు, హెర్పెస్ పుండ్లు లేని చర్మ ప్రాంతాల నుండి కూడా హెర్పెస్ వైరస్ విడుదల కావచ్చు.

ఈ కారణాల వల్ల, హెర్పెస్ రాకుండా కండోమ్‌లు పూర్తిగా రక్షిస్తాయన్న నమ్మకం లేదు.

జననేంద్రియ హెర్పెస్ వల్ల ఆరోగ్యం, లైంగిక జీవితం మరియు సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందోనన్న ఆందోళన సహజం.

అవసరమైన చికిత్స తీసుకుంటూ, ఆందోళనల గురించి వివరంగా డాక్టర్ తో చర్చించడం మంచిది.

నిర్థారణ ఇలా…

అపరిచిత వ్యక్తులతో లైంగికంగా కలిసిన వారం రోజుల్లో నీటి పొక్కులు ఏర్పడి తగ్గి, మళ్లీ తలెత్తుతాయి. పీసీఆర్‌ టెస్ట్‌, హెచ్‌ఎస్‌వి 1, 2, ఐజీజీ, ఐజీఎమ్‌ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్థారించవచ్చు. పుండ్ల దగ్గరి స్రావాలు సేకరించి కల్చర్‌ టెస్ట్‌, డీఎన్‌ఎ టెస్ట్‌, యూరిన్‌ టెస్ట్‌ పరీక్షలతో కూడా నిర్థారించుకోవచ్చు.

దుష్పరిణామాలు:

గర్భిణులకు మొదటి నెలలో హెర్పిస్‌ సోకితే గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ. ప్రసవ సమయంలో పుట్టే పిల్లలకు తల్లి నుంచి సోకుతుంది. దీన్నే నియోనాటల్‌ హెర్పిస్‌ అంటారు. వెన్నెముకలోని నాడీ మండలానికి హెర్పిస్‌ సోకితే అంగస్తంభన సమస్య ఎదురుకావచ్చు. కొందరికి నాడీమండలంలో హెర్పిస్‌ వచ్చి మెనింగ్జయిటిస్‌కు కారణం కావచ్చు.

ఆయుర్వేద చికిత్స ….

మూలకారణాన్ని తొలగించే ఆయుర్వేద చికిత్సతో అద్భుతమైన పరిష్కారం దక్కుతుంది. ఈ చికిత్స రోగనిరోధకవ్యవస్థను బలపరిచి సులువుగా వ్యాధిని నివారిస్తుంది. అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల నేతృత్వంలో చికిత్స తీసుకుంటే హెర్పిస్‌ ఛాయలే లేకుండా పోతాయి.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
పనికిమాలిన పత్యాలు లేకుండా కేవలం మందులతోనే…..

వివరాలకు…

వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..

Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700

Website
https://mathrusreeayurveda.com/home/

Facebook :

https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL

https://www.facebook.com/mathrusreeayurveda/

https://m.facebook.com/doctorayurvedaandsiddha

https://m.facebook.com/ayurvedaandsiddha

Youtube:

https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg

Email :

drmahesh@mathrusreeayurveda.com

Leave a comment

Open chat
1
మీ పేరు,వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
సాధ్యమయినంత త్వరలో స్పదించగలము.

దయచేసి,పూర్తి వివరాల కొరకు Dr.Mahesh గారిని సంప్రదించగలరు.
cell no: 9701965700 ; 8686622900

సంప్రదించవలసిన వేళలు: 11 Am to 8 PM
సంప్రదించినందులకు ధన్యవాదాలు.