Uterus Fibroid గర్భాశయ కణితులు లక్షణాలు చికిత్స

Social Share

గర్భాశయంలోకి వివిధరకాలయిన వస్తువులను పంపి స్త్రీలను హింసించడమనే మొరటు పనులు ఏమాత్రం అవసరం లేదు. గర్భాశయం తొలగించడం అనే దురవస్ధ, దుస్ధితి లేకుండా ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్స కలదు.

గర్భాశయ ఫైబ్రాయిడ్లకు చికిత్సUterine fibroids treatment
Uterus Fibroid గర్భాశయ కణితులు లక్షణాలు చికిత్స

గర్భాశయ ఫైబ్రాయిడ్ల లక్షణాలు, రకాలు, కారణాలు, సమస్యలు, రోగ నిర్ధారణ, చికిత్స :

Uterus Fibroid గర్భాశయ కణితులు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోనని భయపడిపోతుంటారు. నిజానికి గర్బసంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్‌తో సంబంధమేమీ లేదు. ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశమూ లేదనే చెప్పుకోవచ్చు.

గర్భసంచిలో గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో (15-45 ఏళ్లలో) ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగా బయటపడుతుంటాయి.

గర్భసంచిలో Uterus Fibroid గర్భాశయ కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది. ఈస్ట్రోజెన్‌ హార్మోను వీటిని ప్రభావితం చేస్తుందన్నది మాత్రం సుస్పష్టమైంది. ఇవి కొందరిలో వేగంగా మరికొందరిలో నెమ్మదిగా పెరగొచ్చు. కొన్ని ఎప్పుడూ ఒకే సైజులో ఉండొచ్చు, కొన్ని వాటంతటవే కుంచించుకుపోవచ్చు. నెలసరి నిలిచిపోయిన తర్వాత సహజంగానే ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఫైబ్రాయిడ్లు కూడా చిన్నగా అవుతాయి. కొన్నైతే రాళ్లలా గట్టిపడిపోతాయి కూడా.

గర్భాశయ ఫైబ్రాయిడ్ల రకాలు :

గర్భసంచిలో Uterus Fibroid గర్భాశయ కణితులు అనేవి ఆరు రకాలుగా ఉన్నాయి. గర్భాశయం అనేది పియర్ (నేరేడు రకానికి చెందిన పండు) ఆకారంలో ఉండే అవయవం, ఇది మూత్రాశయం మరియు పురీషనాళం మధ్యలో ఉంటుంది. గర్భాశయం అనేది మూడు పొరలుగా విభజించబడింది – (బయటి, మధ్య మరియు లోపలి పొర). గర్భాశయ ఫైబ్రాయిడ్లు ఈ పొరలలో దేని నుండి అయినా పెరగవచ్చు. గర్భాశయ ఫైబ్రాయిడ్లు అనేవి ఆరు రకాలుగా ఉన్నాయి, ఇవి వాటి స్థానాన్ని బట్టి వర్గీకరించబడ్డాయి:

  1. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్లు
  2. సబ్‌సెరోసల్ ఫైబ్రాయిడ్లు
  3. సబ్‌ముకోసల్ ఫైబ్రాయిడ్లు
  4. పెడున్క్యులేటెడ్ ఫైబ్రాయిడ్లు
  5. సర్వైకల్ (గర్భాశయ ముఖద్వారపు) ఫైబ్రాయిడ్లు
  6. బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్లు
1. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్లు

ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్లు అనేవి నిరపాయమైన (క్యాన్సర్ కాని) పెరుగుదలలు మరియు ఇవి గర్భాశయ ఫైబ్రాయిడ్లలో అత్యంత సాధారణ రకం. ఇవి గర్భాశయ గోడ కండరాల లోపల పెరుగుతాయి. ఇవి పెరుగుదల యొక్క స్థానాన్ని బట్టి వర్గీకరించబడ్డాయి.

  • ఆంటీరియర్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ – గర్భాశయం యొక్క ముందు ఉండే కండరాల గోడ లోపల పెరుగుదల.
  • పోస్టిరియర్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ – గర్భాశయం యొక్క వెనుక ఉండే కండరాల గోడ లోపల పెరుగుదల.
  • ఫండల్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ – గర్భాశయం యొక్క పై కండరాల గోడలో పెరుగుదల.
2. సబ్‌సెరోసల్ ఫైబ్రాయిడ్లు :

సబ్‌సెరోసల్ ఫైబ్రాయిడ్లు అనేవి నిరపాయమైన (కాన్సర్ కాని) పెరుగుదలలు మరియు ఇవి గర్భాశయ గోడ యొక్క బయటి కండరాలపై పెరుగుతాయి. ఇవి కూడా గర్భాశయ ఫైబ్రాయిడ్ల యొక్క రకాలలో సాధారణ రకం. ఇది ఒక పెద్ద పెరుగుదల లాగా గాని చిన్న పెరుగుదల లాగా గాని పెరుగుతుంది. ఇది సాధారణంగా తీవ్రమైన కటి నొప్పికి కారణమవుతుంది.

3. సబ్‌మ్యుకోసల్ ఫైబ్రాయిడ్లు :

సబ్‌మ్యుకోసల్ ఫైబ్రాయిడ్లు అనేవి గర్భాశయం యొక్క నిరపాయమైన (క్యాన్సర్ కాని) పెరుగుదలలు సాధారణంగా, ఇవి స్త్రీల యొక్క పునరుత్పత్తి వయస్సులో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి నేరుగా గర్భాశయ లోపలి పొర క్రింద ఉన్న గర్భాశయ కుహరంలోకి పెరుగుతుంది.

సాధారణంగా, ఇవి అతి తక్కువగా వచ్చే గర్భాశయ ఫైబ్రాయిడ్లు (స్త్రీల లో తక్కువగా వచ్చే ఫైబ్రాయిడ్‌ రకం), అయితే ఇవి పీరియడ్స్ (రుతుక్రమం) సమయంలో లేదా ఋతుచక్రం మధ్యలో ఎక్కువ రక్తస్రావం, కటి నొప్పి లేదా నడుము నొప్పి లాంటి తీవ్రమైన లక్షణాలను కలిగిస్తాయి.

4. పెడన్క్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్:

పెడన్క్యులేటెడ్ ఫైబ్రాయిడ్లు అనేవి గర్భాశయం యొక్క నిరపాయమైన (క్యాన్సర్ కాని) పెరుగుదలలు. ఈ ఫైబ్రాయిడ్లు అనేవి కొమ్మ లాంటి పెరుగుదలలు, ఇవి గర్భాశయ గోడకు ఇరుకుగా సంబంధం కలిగి ఉంటాయి. ఇవి గర్భాశయం వెలుపల మరియు లోపల కూడా పెరుగుతాయి. ఇవి పెరుగుదల స్థానాన్ని బట్టి మరింతగా వర్గీకరించబడ్డాయి:

  • పెడన్క్యులేటెడ్ సబ్‌మ్యుకోసల్ ఫైబ్రాయిడ్లు – ఇవి గర్భాశయ గోడ యొక్క బయటి కండరాలపై కొమ్మ లాంటి పెరుగుదల చూపిస్తుంది.
  • పెడన్క్యులేటెడ్ సబ్‌సెరోసల్ ఫైబ్రాయిడ్లు – ఇవి గర్భాశయ కుహరంలో కొమ్మ లాంటి పెరుగుదలలు , ఇవి నేరుగా గర్భాశయ లోపలి పొరకు దిగువన ఉంటాయి.
5. సర్వైకల్ (గర్భాశయ ముఖద్వారపు) ఫైబ్రాయిడ్లు :

సర్వైకల్ (గర్భాశయ ముఖద్వారపు) ఫైబ్రాయిడ్లు గర్భాశయం యొక్క నిరపాయమైన (క్యాన్సర్ కాని) పెరుగుదలలు. ఇవి గర్భాశయ ముఖద్వారంలో అభివృద్ధి చెందుతాయి. గర్భాశయ ఫైబ్రాయిడ్‌ల రకాలలో ఇది ఒక అరుదైన రకం, మరియు ఇది రుతుక్రమంలో ఎక్కువ రక్తస్రావాన్ని కలుగజేయడం, రక్తం గడ్డలు కట్టడం, రక్తహీనత, కటి ప్రాంతంలో నొప్పి లేదా వెన్నునొప్పి, తరచుగా మూత్రవిసర్జనను కలిగించడం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

6. బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్లు:

బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్లు నిరపాయమైన కండర పెరుగుదలలు , ఇవి మృదు కండరం లేదా గర్భాశయ మృదు కండరం యొక్క హార్మోన్ (వినాళగ్రంధుల స్రావము) సున్నితత్వం వల్ల అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా, బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్ అనేది గర్భాశయ ఫైబ్రాయిడ్ల యొక్క అరుదైన రకం, అయితే పెల్విక్ (కటి) ప్రాంతంలో దీర్ఘకాలిక నొప్పి, మూత్రాశయ కుదింపు మరియు ప్రేగు పనిచేయకపోవడం వంటి లక్షణాలను కలుగజేస్తుంది.

మృదువైన కండరాల కణాలు మరియు ఫైబ్రోబ్లాస్ట్‌లు అసాధారణంగా పెరిగి ఫైబ్రాయిడ్‌లకు దారితీస్తాయి. ఫైబ్రాయిడ్లు కటి భాగము నుండి దిగువ పొత్తికడుపులోకి మరియు కొన్ని సందర్భాల్లో పై పొత్తికడుపులోకి వ్యాపిస్తాయి. ప్రత్యామ్నాయంగా, అవి మైయోమెట్రియం నుండి పొడుచుకు వచ్చి గర్భాశయంలోకి ప్రవేశించవచ్చు.

గర్భాశయ ద్రవ్యరాశి (కణ రాశి)ని సాధారణ ఫైబ్రాయిడా లేదా క్యాన్సర్ కనితా అని చెప్పడం అప్పుడప్పుడు సవాలుగా ఉంటుంది. ఎందుకనగా ఇవి క్యాన్సర్తో సంబంధం ఉన్నవి కావు మరియు క్యాన్సర్గా మారడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఫైబ్రాయిడ్లు బఠానీ పరిమాణం నుండి పుచ్చకాయ పరిమాణం వరకూ ఉంటాయి. సాధారణంగా గర్భాశయ ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కానప్పటికీ, అవి బాధాకరమైనవి, మరియు అప్పుడప్పుడు ఎర్ర రక్త కణాల తగ్గుదల (రక్తహీనత) వంటి సమస్యలకు దారితీయవచ్చు. గణనీయమైన రక్త నష్టం కారణంగా ఇది అలసటకు కారణమవుతుంది. రక్తాన్ని కోల్పోయిన వాళ్ళలో అరుదుగా రక్త మార్పిడి అవసరం పడవచ్చు.

గర్భాశయ ఫైబ్రాయిడ్ల వ్యాప్తి (Prevalence of Uterine Fibroids) :

గర్భసంచిలో Uterus Fibroid గర్భాశయ కణితులు దాదాపు 20-80% మంది స్త్రీలలో 50 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఫైబ్రాయిడ్‌లు అభివృద్ధి చెందుతున్నాయి. ఫైబ్రాయిడ్లు ఉన్న స్త్రీలు ఎక్కువ మంది సాధారణంగా 40 నుండి 50 వయస్కుల మధ్యవారు. ఫైబ్రాయిడ్ ప్రభావిత స్త్రీలందరూ లక్షణాలను అనుభవించరు. లక్షణాలను అనుభవించే స్త్రీలలో ఫైబ్రాయిడ్లను ఎదుర్కోవడం కష్టంగా ఉండవచ్చు.నివేదికల ప్రకారం, భారత దేశంలో, నగరాల్లో ఉంటున్న వారిలో 24% మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వారిలో 37.65% మంది ప్రజలలో ఫైబ్రాయిడ్స్ అభివృద్ధి చెందాయి. భారతదేశంలో సంవత్సరానికి పది లక్షల కంటే ఎక్కువ గర్భాశయ ఫైబ్రాయిడ్‌ల సంఘటనలు కనిపిస్తున్నాయి.

గర్భాశయ ఫైబ్రాయిడ్ల సంకేతాలు మరియు లక్షణాలు Uterine fibroid symptoms

గర్భసంచిలో Uterus Fibroid గర్భాశయ కణితులు యొక్క లక్షణాలు చాలా మంది రోగులలో కనిపించవు (లక్షణరహితమైనవి) కానీ సాధారణంగా గర్భాశయ ఫైబ్రాయిడ్ల లక్షణాలు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:

  • దీర్ఘకాలపు లేదా భారీ ఋతు స్రావం (మెనోర్హ్హేజియా) అనేది అత్యంత సాధారణ లక్షణo
  • కటి ప్రదేశంలో ఒత్తిడి లేదా నొప్పి – ఈ లక్షణం ఉన్నపుడు దీనిని పెద్ద ఫైబ్రాయిడ్‌లుగా అనుమానించవచ్చు
  • కటి ప్రదేశంలో అసౌకర్యం లేదా నడుము క్రింది భాగములో నొప్పి
  • బాధాకరమైన (నొప్పి తో కూడిన) సంభోగం (డిస్పేరూనియా)
  • మూత్రం తరచుదనం, మూత్రం ఆవశ్యకత, మూత్రం నిలుపుదల వంటి మూత్ర లక్షణాలు
  • మలబద్ధకం (ప్రేగుల నుండి మలాన్ని విసర్జించడంలో ఇబ్బంది, సాధారణంగా గట్టిపడిన మలంతో సంబంధం కలిగి ఉంటుంది)
  • పునరావృత (మళ్లి వచ్చే) గర్భస్రావం, అకాల ప్రసవం, గర్భస్థ శిశువు యొక్క అసాధారణ స్థానం, సిజేరియన్ డెలివరీ మరియు ప్లాసెంటల్ అబ్రప్షన్ (గర్భాశయంలోని పొర దెబ్బతినడం) వంటి ప్రసవ సమస్యలు
  • సంతానలేమి

 

గర్భాశయ ఫైబ్రాయిడ్లను కలుగచేసే కారణాలు  Uterine fibroid causes

గర్భసంచిలో Uterus Fibroid గర్భాశయ కణితులు రావడానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియవు. ఫైబ్రాయిడ్స్‌ అనేవి పునరుత్పత్తి వయస్సులో ఉన్న మహిళల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా మొదటి ఋతుస్రావం లేని యువ స్త్రీల లో ఇవి గమనించబడవు (మెనార్చే). పరిశోధన మరియు క్లినికల్ డేటా ఆధారంగా, గర్భాశయ ఫైబ్రాయిడ్లు అభివృద్ధి చెందడానికి కొన్ని కారకాలు ఉన్నాయి, అవి ఏమిటనగా:

  • ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్ల అసమతుల్యత
  • జన్యుపరమైన మార్పులు (జన్యు ఉత్పరివర్తనలు)
  • ఇతర ఇన్సులిన్ లాంటి వృద్ధి (పెరుగుదల) కారకాలు
  • పెరిగిన ఎక్స్‌ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ (ECM)
గర్భాశయ ఫైబ్రాయిడ్స్‌ రావడానికి గల ప్రమాద కారకాలు  Risk factors for uterine fibroids 

స్త్రీలలో గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లను అభివృద్ధిని ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి, అవి ఏమిటనగా:

  • ఊబకాయం
  • ప్రారంభ రుతుక్రమం (మొదటి సంభవం)
  • శూన్యత-సంతానోత్పత్తి కాని స్త్రీ (ఇప్పటి వరకు గర్భం దాల్చని స్త్రీలు)
  • విటమిన్ డి లోపం (హైపోవిటమినోసిస్ డి)
  • రుతువిరతి ఆలస్యంగా రావటం (ఆలస్యమైన రుతు విరామం)
  • అధిక రక్తపోటు
  • కుటుంబంలోని వారికి గర్భాశయ ఫైబ్రాయిడ్లు ఉండటం.
గర్భాశయ ఫైబ్రాయిడ్స్ వల్ల కలిగే సమస్యలు  Complications of uterine fibroids

ప్రసవ వయస్సులో ఉన్న మహిళల్లో ఫైబ్రాయిడ్లు అత్యంత ప్రబలమైన కణితి అయినప్పటికీ, వాటి నుండి తీవ్రమైన సమస్యలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే, అవి సంభవించినప్పుడు, తీవ్రమైన సమస్యలు స్త్రీ యొక్క జీవన నాణ్యతపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి, ఇవి గణనీయమైన అనారోగ్యాలను మరియు మరణాలను చాలా అరుదుగా కలిగిస్తాయి. గర్భాశయ ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే కొన్ని సంక్లిష్టతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • థ్రోంబోఎంబోలిజం (రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తనాళాన్ని అడ్డుకోవడం)
  • మలబద్ధకం
  • స్త్రీ పునరుత్పత్తి అవయవాలు వక్రీకరించబడటం (ఆడ వారి అవయవాలు మెలితిప్పబడటం లేదా అణిచివేయబడటం)
  • రక్త ప్రసరణలో అంతరాయం, ఇది గర్భధారణ సమస్యలకు దారితీస్తుంది
  • సంతానలేమి-సంతానోత్పత్తి లేకపోవడం
  • గర్భధారణ సమయంలో రెడ్ డీజెనెరేషన్ (ఫైబ్రాయిడ్ మెలితిప్పబడటం)
గర్భాశయ ఫైబ్రాయిడ్ల నిర్ధారణ   Uterine fibroids diagnosis

సాధారణ కటి పరీక్ష సమయంలో, ఫైబ్రాయిడ్‌లు మొదటిసారిగా గుర్తించబడవచ్చు. అయినప్పటికీ, ఫైబ్రాయిడ్ల గురించి మరింత ఖచ్చితంగా వెల్లడించే అనేక పరీక్షలు ఉన్నాయి. చికిత్స ప్రారంభించే ముందు ఫైబ్రాయిడ్ల రకాన్ని తెలుసుకోవడానికి గైనకాలజిస్ట్ ఈ క్రింది రోగనిర్ధారణ ప్రక్రియలో కొన్నింటిని నిర్వహించవచ్చు:

  • రక్త పరీక్షలు
  • రేడియాలజీ పరీక్ష (ఉదరం మరియు పెల్విస్ యొక్క అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌ వెజైనల్ అల్ట్రాసోనోగ్రఫీ)
  • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT)
  • మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI)
  • హిస్టెరోస్కోపీ
  • హిస్టెరోసల్పింగోగ్రఫీ
  • సోనోహిస్టెరోగ్రామ్
  • లాపరోస్కోపీ

అధిక రుతుస్రావం.. నొప్పి..

సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువరోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్‌ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు. గడ్డలు మూత్రకోశానికి అడ్డువస్తే మూత్ర సమస్యలు, పురీషనాళానికి అడ్డొస్తే మలబద్ధకం వంటివీ బయలుదేరతాయి.

చికిత్స ఏంటి?
ప్రపంచ ప్రఖ్యాత  వైద్య విధానం:

కడుపు నొప్పి మరియు రక్తస్రావం వంటి లక్షణాల చికిత్సకు ఉపయోగించే మందులు:

  • నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు)
  • యాంటీఫైబ్రినోలైటిక్స్
  • గోనాడోట్రోపిన్ విడుదల చేసే హార్మోన్ అగోనిస్ట్‌ (GnRHa) మందులు
  • విటమిన్ మరియు ఐరన్ సప్లిమెంట్స్
  • ప్రొజెస్టిన్ను -విడుదల చేసే గర్భాశయ పరికరం (IUD)

గర్భాశయ ఫైబ్రాయిడ్ల కోసం శస్త్రచికిత్స ఎంపికలు:

  • గర్భాశయ ధమని యొక్క ఎంబోలైజేషన్
  • రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్
  • హిస్టెరోస్కోపిక్ మైయోమెక్టోమీ
  • ఎండోమెట్రియల్ అబ్లేషన్
  • మైయోలిసిస్
  • మైయోమెక్టమీ – ఓపెన్, లాపరోస్కోపిక్ లేదా రోబోటిక్
  • ఉదర మయోమెక్టమీ లేదా లాపరోటమీ
  • టోటల్ హిస్టెరెక్టమీ – ఓపెన్, లాపరోస్కోపిక్ లేదా రోబోటిక్

ఫైబ్రాయిడ్లు ఉన్నా బాధలేవీ లేకపోతే ఎలాంటి చికిత్స అవసరం లేదు. ఏడాదికి ఒకసారి స్కానింగు చేసి గడ్డలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటే చాలు. బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం.. గడ్డలు ఏర్పడిన చోటు, బాధల తీవ్రత, మహిళల వయసును బట్టి గర్భాశయం తొలగించడం అనే  చికిత్స చేస్తారు. నెలసరి నిలిచిపోవటానికి దగ్గర్లో ఉన్నవారికి తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు. ఫైబ్రాయిడ్లకు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి.

సైడెఫెకక్ట్స్:

అల్లోపతి మందులు తాత్కాలికంగా ముట్లుడిగిపోయేలా చేస్తూ.. కణితుల సైజు తగ్గటానికి తోడ్పడతాయి. అయితే ఈ మందులతో వేడి ఆవిర్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల వీటిని 3-6 నెలల కన్నా ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. దీర్ఘకాలం వేసుకుంటే ఎముక క్షీణతకూ దారితీయొచ్చు. కొందరికి ప్రొజెస్టిరాన్‌ను విడుదల చేసే ఐయూడీని లోపల అమరుస్తారు. ఇది రుతుస్రావం అధికంగా కావటాన్ని తగ్గిస్తుంది. కొందరికి గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తుంటారు. అవసరమైతే ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. సంతానం కలగనివారికి కేవలం కణితులనే తొలగించి, గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చేమో పరిశీలిస్తారు. ప్రస్తుతం అబ్లేషన్‌ ప్రక్రియతో కణితికి రక్తాన్ని సరఫరా చేసే నాళాన్ని మూసేసే పద్ధతి కూడా అందుబాటులో ఉంది. దీంతో గడ్డ క్రమేపీ చిన్నదై, మాయమవుతుంది.

ఆయుర్వేదం చెప్పే కారణాలు:

ఇవిరావడానికి ప్రధాన కారణం చిత్తచాంచల్యము… ఆహారపుటలవాట్లు కారణంగా భావించవచ్చు… సకాలంలో వివాహం ఐన స్త్రీలకు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కనిపించుటలేదు… నవీన నాగరికత ప్రభావం వలన వివాహం ఆలస్యం కావడం… ఆలోచనలను సినీమాలు ప్రేరేపించడం … అలా ఏర్పడిన మానసిక వత్తిడే ఈసమస్యకు కారణమనిపిస్తోంది… యోగాభ్యాసం ధ్యానంచేయుటచేత ఇవి అదుపులోకిరావడం కనిపించింది… అశోక, నాగకేసరాలు , భూమ్యామలక, దూసరాకు (పైనపట్టుగావేయుట) కూడా సమస్యను తగ్గించడం గమనించడం జరిగింది…
ఏదైనా మొరటువైద్యంవలన ఫలితం శూన్యం… సున్నితమైన ఆయుర్వేదమే చక్కని పరిష్కారం…
—-Janardhana Ramanuja Das pyla గారు

ఆయుర్వేదం అనే అత్యుత్తమ వైద్య విధానం:

ఏ విధమైన సైడెఫెక్ట్స్ లేకుంకుండా కేవలం మందులతోనే సంపూర్ణంగా, శాశ్వతంగా నివారించవచ్చు.
సూదులు, దబ్బళాలతో పొడవాల్సిన పని లేదు. గర్భాశయంలోకి వివిధరకాలయిన వస్తువులను పంపి స్త్రీలను హింసించడమనే మొరటు పనులు ఏమాత్రం అవసరం లేదు. గర్భాశయం తొలగించడం అనే దురవస్ధ, దుస్ధితి లేకుండా అత్యుత్తమ చికిత్స కలదు.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..

వివరాలకు….

వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..

Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700

Website
https://mathrusreeayurveda.com/home/

Facebook :

https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL

https://www.facebook.com/mathrusreeayurveda/

https://m.facebook.com/doctorayurvedaandsiddha

https://m.facebook.com/ayurvedaandsiddha

Youtube:

https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg

Email :

drmahesh@mathrusreeayurveda.com

Leave a comment

Open chat
1
మీ పేరు,వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
సాధ్యమయినంత త్వరలో స్పదించగలము.

దయచేసి,పూర్తి వివరాల కొరకు Dr.Mahesh గారిని సంప్రదించగలరు.
cell no: 9701965700 ; 8686622900

సంప్రదించవలసిన వేళలు: 11 Am to 8 PM
సంప్రదించినందులకు ధన్యవాదాలు.